ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Electricity Charges Huge Increase in YSRCP Government: మాట తప్పి.. మడమ తిప్పేసిన జగన్.. విద్యుత్‌ ఛార్జీలను ఎడాపెడా పెంచి ప్రజలకే షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం

Electricity Charges Huge Increase in YSRCP Government: అధికారం చేపట్టిన తొలిరోజు ఇచ్చిన హామీకే ముఖ్యమంత్రి మంగళం పాడేశారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తామంటూ గొంతు చించుకుని అరిచిన సీఎం జగన్.. తగ్గించడం మాట దేవుడెరుగు అంతకంతకూ పెంచుకుంటూ పోయారు. శ్లాబ్‌ల మార్పు, ట్రూఅప్‌, స్థిర ఛార్జీలు అంటూ ప్రజలపై భారం మోపారు. ఏటా 10వేల 403 కోట్ల మేర అదనంగా గుంజేశారు.

Electricity Charges Huge Increase in YSRCP Government
Electricity Charges Huge Increase in YSRCP Government

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 9:01 AM IST

Updated : Oct 18, 2023, 11:59 AM IST

Electricity Charges Huge Increase in YSRCP Government: మాట తప్పి.. మడమ తిప్పేసిన జగన్.. విద్యుత్‌ ఛార్జీలను ఎడాపెడా పెంచి ప్రజలకే షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం

Electricity Charges Huge Increase in YSRCP Government :ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై నుంచే జగన్‌ తన మొదటి ప్రసంగంలో హామీ ఇచ్చారు. సీఎం హోదాలో విద్యుత్తు ఛార్జీలను పూర్తిగా తగ్గిస్తానంటూ ప్రజలకు మొదటిసారి ఇచ్చిన హామీనే జగన్ తుంగలో తొక్కారు. ఛార్జీలు తగ్గించడం మాట అటుంచితే ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు..పేరిట జనంపై అదనపు బాదుడు బాదేశారు. ప్రతి నెలా వేలల్లో వస్తున్న విద్యుత్తు బిల్లులు కట్టలేక ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.

Electricity Bills in AP :నాలుగేళ్లలో విద్యుత్తు ఛార్జీలను ఎడాపెడా పెంచి జగన్‌ ప్రభుత్వం ప్రజలకే షాకిచ్చింది. ఏ ఇంటి విద్యుత్తు బిల్లు చూసినా ప్రభుత్వ టారిఫ్ ప్రకారం వినియోగించిన విద్యుత్తుకు వసూలు చేసే మొత్తంతో పాటు.. ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏ ఛార్జీలు పేర్లతో ప్రభుత్వ అదనపు బాదుడు కనిపిస్తోంది. విద్యుత్తు రేట్లు తగ్గిస్తానంటూ సీఎం హోదాలో మొదటిసారి ఇచ్చిన హామీనే జగన్ నెరవేర్చకుండా మాట తప్పి.. మడమ తిప్పారని ప్రజలు మండిపడుతున్నారు.

Electricity Adjustment Charges: ''విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరిట సామాన్యులపై భారం సహించేది లేదు''

CM Jagan Trampled the Guarantee of Electricity Charges : గత ప్రభుత్వం పవన సౌర విద్యుదుత్పత్తి సంస్థలతో 21 కొనుగోలు ఒప్పందాలను అధిక ధరకు కుదుర్చుకుందని సీఎం జగన్ అప్పట్లో ఉదరగొట్టేవారు. వాటివల్ల రాష్ట్రంపై వేల కోట్ల భారం పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు. అందుకే గత ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏలను సమీక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీని కోసం ఉన్నతస్థాయి మంత్రుల కమిటీనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు మేలు చేయకపోగా.. జగన్ తీరుతో విద్యుత్తు రంగంలో పెట్టుబడులు పెట్టాలంటేనే విదేశీ కంపెనీలు ఆలోచించే స్థాయికి రాష్ట్ర ప్రతిష్ట దిగజారింది.

టీడీపీ హయాంలో విద్యుదుత్పత్తి సంస్థలతో 25 ఏళ్ల పాటు పీపీఏలు కుదుర్చుకోవడాన్ని తప్పు పట్టిన జగన్ ప్రభుత్వం.. రాజస్థాన్‌లోని సౌర విద్యుత్తు ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్తును సెకి ద్వారా 25 ఏళ్ల పాటు తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుందంటేనే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్థమవుతోంది.

Electricity Charges Burden on Industries in Andhra Pradesh: విద్యుత్​ భారాన్ని మోయలేక విలవిలలాడుతున్న పరిశ్రమలు..

Electricity Charges Hike in AP :వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూఆప్ అనేది విద్యుత్తు వినియోగదారులకు తరచూ వినిపించే పదంగా మారింది. నెలవారీగా వాడిని విద్యుత్తుకు బిల్లు ఎంత వచ్చిందని మాత్రమే గతంలో వినియోగదారులు చూసేవారు. ప్రభుత్వ బాదుడుతో పరిస్థితి మారింది. ప్రతి నెలా బిల్లు వచ్చి రావడంతోనే ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ భారం ఎంత పడిందో చూసుకునే దుస్థితిని వినియోగదారులకు ప్రభుత్వం కల్పించింది. ఏడాదిలో విద్యుత్తు కొనుగోలు, ఇతర ఖర్చులకు ఏపీఈఆర్‌సీ అనుమతించిన మొత్తం కంటే అదనంగా చేసిన ఖర్చును ట్రూఅప్ పేరుతో డిస్కంలు వసూలు చేస్తాయి.

ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవడానికి ఏడాది వరకు ఆగడం ఎందుకనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. దీంతో ఒక నెలలో సర్దుబాటు ఛార్జీలను ఆ తర్వాత నెల బిల్లులో కలిపి వసూలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం 2023-24 నుంచి ప్రతి నెలా యూనిట్‌కు గరిష్టంగా 40 పైసలు ఎఫ్‌పీపీసీఏ పేరిట వసూలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం డిస్కంలకు కల్పించింది. ఈ లెక్కనే ప్రతి నెలా ఎఫ్‌పీపీసీఏ చెల్లించడంతో పాటు ఏడాది తర్వాత ట్రూప్ భారాన్ని కూడా వినియోగదారులు భరించాల్సిందేనని ప్రభుత్వం తేల్చింది.

PRATIDWANI కేంద్రం నిర్ణయంతో ఇకపై నెలనెలా కరెంటు షాకులు

Last Updated : Oct 18, 2023, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details