Vijayawada Swimming pool: వారంతా వివిధ ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థులు. వారిలో ప్రతిభను బయటకు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం కీడా పోటీలను నిర్వహించాలనుకుంది. అంతా బాగానే ఉందనుకుని పోటీలకు సిద్ధమైన ఆయా పాఠశాల విద్యార్థులకు నిరాశ తప్పలేదు. కొలనులో నీరు కలుషితంగా ఉండటంతో.. అధికారులు ఈత పోటీలను వాయిదా వేశారు. జాతీయ క్రీడలు అని చెప్పడం తప్పా... అందుకు తగ్గట్టు వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆర్భాటాలకు కాకుండా వాస్తవ అంశాలపై దృష్టి పెడితే మంచిదని వెల్లడించారు. పోటీల్లో పాల్గొనాలనుకున్న విద్యార్థులకు నిరాశ తప్పలేదు.
ఈత కొలను అపరిశుభ్రం.. జాతీయ క్రీడా పోటీలు వాయిదా - స్విమ్మింగ్ పోటీలు
Model School Swimming Competitions : విజయవాడ గాంధీనగర్లో నగరపాలక సంస్థకు చెందిన ఈతకొలను. ఇది ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడా పోటీల్లో భాగంగా అక్కడ క్రీడాకారులకు అదివారం పోటీలు నిర్వహించాలి. నీరు బాగోలేక పోటీలను వాయిదా వేశారు.
Vijayawada Swimming