ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Teachers: టీచర్లకు విద్యాశాఖ షాక్​.. సెలవులు విద్యార్థులకే.. మీకు కాదూ..! - We love to read program

Education Department orders to teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలనిచ్చింది. విద్యార్థులు సెలవుల్లో ఏమి చేయాలో.. ఎలా చదవాలో.. ప్రవేశాల నిర్వహణలాంటి పనులు చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

Education Department orders to teachers
Education Department orders to teachers

By

Published : Apr 28, 2023, 3:36 PM IST

Education Department orders to teachers: వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలనిచ్చింది. 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లు అందించడం.. "మేము చదవడాన్ని ఇష్టపడతాం" జగనన్న విద్యాకానుక కిట్ల సరఫరా, పీఎం శ్రీ పాఠశాలల కాస్టింగ్‌ షీట్‌ రూపకల్పన.. "నాడు-నేడు" పనులు, పిల్లలు గ్రంథాలయాలకు వెళ్లేలా చూడటం, విద్యార్థుల ప్రవేశాల నిర్వహణలాంటి పనులను అప్పగించింది. సెలవులు విద్యార్థులకేగానీ ఉపాధ్యాయులకు కాదంటూ.. కొందరు అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

23 రకాల కార్యకలాపాలు నిర్వర్తించాలి..ఈ క్రమంలో మే 1 నుంచి పాఠశాలలకు ఇచ్చే సెలవుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులపై ఉన్నాతాధికారులు ఆదేశాలనిచ్చారు. ఉపాధ్యాయులు బడికి రావాలా వద్దా అనే దానిపై స్పష్టత ఇవ్వకుండానే అనేక పనులు అప్పగించారు. దీనిపై ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. "నాడు-నేడు" పనులు, పదో తరగతి ఫలితాల తర్వాత టీసీల జారీ, ఇతరాత్ర కార్యకలాపాల కోసం ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు బడులకు రావాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు సెలవు పెడితే సమీపంలో మరో ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశించారు. వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాలలో 23 రకాల కార్యకలాపాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లు ఇవ్వాలని ఆదేశించిన అధికారులు ముద్రించిన వాటిని మాత్రం సమకూర్చలేదు.

వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేయాలి..వాటిని జిరాక్స్‌ తీసేందుకు ఉపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. "మేము చదవడాన్ని ఇష్టపడతాం" కార్యక్రమాన్ని మే ఒకటో తేదీ నుంచి జూన్‌ పదో తేదీ వరకు నిర్వహించాలి. పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి. ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలి. వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి రోజు వారీగా కథలను అందులో పోస్టు చేయాలి. ఆ కథలు చదివాక విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలి. విద్యార్థుల చదివే సామర్థ్యం ఆధారంగా పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలను ఒక్కొక్కరికి ఐదు నుంచి పది ఇవ్వాలి. ఇచ్చిన పుస్తకాలను విద్యార్థి చదివేస్తే స్నేహితుల వద్దనున్న పుస్తకాలతో మార్చుకునేలా చూడాలి. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రజా గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలను తెచ్చుకునేలా పిల్లలకు అవగాహన కల్పించాలి.

ఈ పనులను రికార్డు చేయాలి. అధికారులు ఎప్పుడైనా పరిశీలిస్తే చూపించాల్సి ఉంటుంది. విద్యార్థుల ప్రవేశాలపైనా దృష్టి పెట్టాలి. ఐదో తరగతి పూర్తైన వాళ్లు ప్రభుత్వ బడుల్లో ఆరో తరగతిలో చేరేలా చూడాలి. కింద తరగతుల్లోనూ విద్యార్థుల ప్రవేశాలపై దృష్టి పెట్టాలి. పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి. పిల్లవాడి బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలి. వారే తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని సూచించారు. పిల్లలు సైతం వేసవి సెలవుల్లో తామేం చేశామో నోట్‌బుక్‌లో రాసి తరగతి ఉపాధ్యాయుడికి ఇవ్వాలి. దీన్ని కచ్చితంగా అమలు చేయాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details