ED Questioning Puri Jagannath And Charmy: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్, నటి ఛార్మిని ఈడీ అధికారులు ఉదయం నుంచి విచారించారు. ఇటీవల విడుదలైన ఓ చిత్రానికి సంబంధించి పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇద్దరికీ వారం క్రితం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
12 గంటల పాటు.. పూరి జగన్నాథ్, ఛార్మిని ప్రశ్నించిన ఈడీ - director puri jagannath news
ED Questioning Puri Jagannath And Charmy: ఈడీ కార్యాలయంలో దర్శకుడు పూరి జగన్నాథ్, నటి ఛార్మి విచారణ ముగిసింది. దాదాపు 12 గంటల పాటు వీరి విచారణ కొనసాగింది. వీరిద్దరూ ఫెమా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఈడీ అధికారులు పలు ఆధారాలు సేకరించారు.
![12 గంటల పాటు.. పూరి జగన్నాథ్, ఛార్మిని ప్రశ్నించిన ఈడీ charmi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16958532-954-16958532-1668698871089.jpg)
puri
ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొనడంతో.. ఉదయం 8గంటలకు పూరి జగన్నాథ్, ఛార్మి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు 12 గంటల పాటు విచారణ కొనసాగింది. ఇటీవల విడుదలైన సినిమాకు సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది.
ఇవీ చదవండి:
Last Updated : Nov 17, 2022, 9:14 PM IST