ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఈసీ నిర్ణయం - Trs To Brs

Trs Name Changed To Brs: తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆర్​ఎస్​ పేరును బీఆర్​ఎస్​గా మారుస్తు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్​ రావుకు లేఖ పంపింది.

Brs
భారతీయ రాష్ట్ర సమితి

By

Published : Dec 8, 2022, 6:45 PM IST

Updated : Dec 8, 2022, 7:06 PM IST

Trs Name Changed To Brs: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్​ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం తీసుకుంది. బీఆర్​ఎస్​గా పేరు మార్పుపై పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు ఈసీ అధికారికంగా లేఖ పంపింది. గత నెల 5న దసరా రోజున పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం మేరకు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబరు 9న మధ్యాహ్నం 1.20 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమం, జెండా ఆవిష్కరణ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈసీ లేఖకు స్పందనగా ఎన్నికల సంఘానికి కేసీఆర్‌ లేఖ పంపనున్నారు.

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఈసీ నిర్ణయం
Last Updated : Dec 8, 2022, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details