Arrangements for Bhavani Deeksha Viramana: ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈసారి కరోనా ప్రభావం లేనందున సుమారు 7 లక్షల మంది వరకు భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తారని అంచనా వేస్తున్నట్లు పెర్కొన్నారు. ఈ సంవత్సరం భవానీలకు ఇబ్బంది లేకుండా 3 అగ్ని గుండాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశఖండన శాలల నిర్మాణం చేశామన్నారు. సీతమ్మ పాదాలు, భవానీ ఘాట్, పున్నమి ఘాట్లో జల్లు స్నానాలకు ఏర్పాటు చేశామన్నారు. 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. కొరత లేకుండా 20లక్షల లడ్డూలు సిద్దం చేస్తున్నామని వివరించారు.
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్దం: ఈవో భ్రమరాంబ - Indrakiladri Eo Bhramaramba
Durga Temple EO D Bramaramba: ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశఖండన శాలల నిర్మాణం చేశామన్నారు. సీతమ్మ పాదాలు, భవానీ ఘాట్, పున్నమి ఘాట్లో జల్లు స్నానాలకు ఏర్పాటు చేశామన్నారు. భద్రత కోసం 3500 మంది పోలీసులను వినియోగించనున్నట్లు తెలిపారు.
గిరి ప్రదక్షిణ చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని ఈవో భ్రమరాంబ తెలిపారు. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. గత సంవత్సరం రూ.6 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. నిర్వహణ కోసం రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు. ఈ సంవత్సరం రూ.7 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సారి మరిన్ని ఏర్పాట్లు చేయడం వల్ల ఖర్చు పెరిగినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఐదు రోజులపాటు వివిధ దేవస్థానల నుంచి 200 మంది సిబ్బందిని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. భద్రత కోసం 3500 మంది పోలీసులను వినియోగించనున్నట్లు తెలిపారు. ఐదు రోజులపాటు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇవీ చదవండి: