Disha rape case accused encounter: దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో భాగమైన పోలీసులపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. దిశ ఎన్ కౌంటర్‌పై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ కూడా పోలీసులపై కేసు నమోదు చేయాలని సిఫారసు చేసిందన్నారు. సోమవారం రోజు ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషర్ల తరఫు సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ వాదనలు వినిపించారు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీసు కస్టడీకి తీసుకున్న నలుగురిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లారని.. అయితే అక్కడ ఎలాంటి వస్తువులు స్వాధీనం చేసుకున్నారో ఇప్పటివరకు వెల్లడించలేదని కోర్టుకు తెలిపారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్.. పోలీసులపై కేసు నమోదు చేయాలని హైకోర్టులో వాదనలు - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
Disha rape case accused encounter : 2019 సంవత్సరంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటనలో నిందితులపై ఎన్కౌంటర్ జరిపిన పోలీసులపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని నిందితుల తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీసు కస్టడీకి తీసుకున్న ఆ నలుగురిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లారని.. అయితే అక్కడ ఎలాంటి వస్తువులు స్వాధీనం చేసుకున్నారో ఇప్పటి వరకు పోలీసులు వెల్లడించలేదని న్యాయస్థానానికి విన్నవించారు.
పోలీసుల నుంచి ఆయుధాలు తీసుకుని కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించారని, ఇందులో భాగంగా ఆత్మరక్షణ నిమిత్తం జరిపిన కాల్పుల్లో నిందితులు మృతి చెందారని చెబుతున్నారని హైకోర్టుకు నిందితుల తరఫు న్యాయవాది వివరించారు. మణిపూర్ జరిగిన సంఘటనపై 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ నేపథ్యంలో ప్రస్తావించారు. ఒక సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఉన్నప్పటికీ కౌంటర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని అన్నారు. దీనికి సంబంధించి పలు సుప్రీంకోర్టు తీర్పులున్నాయని తెలిపారు. దీనిపై తదుపరి వాదనలు జనవరి 2న కొనసాగనున్నాయి.
ఇవీ చదవండి: