ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Dilapidated Government Buildings in Vijayawada: "పాతవి ఉండగా.. కొత్తవి ఎందుకు..?' ప్రజాధనం వృథాపై ప్రజాసంఘాల ఆగ్రహం

Dilapidated Government Buildings in Vijayawada: కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు నిర్వాహణ లేక విజయవాడలో శిథిలావస్థకు చేరుకున్నాయి. కబేళా, ఎస్సీ వసతి గృహం, అంగన్వాడీ సెంటర్ నిరుపయోగంగా మారాయని.. ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారే ప్రమాదం ఉందని ప్రజలు అంటున్నారు. భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

Dilapidated_Government_Buildings_in_Vijayawada
Dilapidated_Government_Buildings_in_Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 3:34 PM IST

Dilapidated Government Buildings in Vijayawada :మూడు కోట్ల రూపాయలతో రెండు దశాబ్ధాల క్రితం కబేళా సెంటర్ సమీపంలో నిర్మించిన కబేళా ప్రస్తుతం జీర్ణావస్థకు చేరుకుంది. రెండు అంతస్తుల్లో నిర్మించిన భవనం నేడు కింది ఫ్లోర్​లోని ఓ భాగం మాత్రమే వినియోగంలో ఉంది. మిగతా భవనం మొత్తం వినియోగించకపోవడంతో నిరుపయోగమయ్యింది. పై అంతస్థు మొత్తం చెత్తా చెదారంలో పూర్తిగా వినియోగానికి పని రాని విధంగా తయారయ్యిందని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Dilapidated Government Buildings in Vijayawada: శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలు..ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజాధనం వృథా.. ప్రజాసంఘాలు ఆగ్రహం

Public Money is Wasted With Government Decisions :ఈ భవనాన్ని వినియోగించుకొని నూతన సాంకేతికతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ప్రజాసంఘాల నేతలు చెబుతున్నారు. ఈ కబేళాకి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం.. ప్రస్తుతం సింగ్ నగర్​లోని జనావాసాల మధ్య మరో కబేళా కేంద్రాన్ని కట్టడానికి సిద్ధపడిందని తెలిపారు. దీన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఉన్న కబేళాన్ని అభివృద్ధి చేయకుండా మరో కబేళాన్ని నిర్మిస్తామని చెప్పడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని దుయ్యబడుతున్నారు.

పెచ్చులూడి.. ఇనుప చువ్వలు వేలాడుతూ.. భయం భయంగా చిన్నారులు

Skill Hub in Dilapidated Buildings :విజయవాడ నగరంలోని రోటరీనగర్​లో కోట్లది రూపాయలతో నిర్మించిన ఎస్సీ వసతి గృహం చిన్నపాటి మరమ్మతులతో మరికొన్ని రోజులు వినియోగించడానికి అవకాశం ఉంది. అయితే ఆరేళ్ల క్రితం భవనం పాడయ్యిందని ఇక్కడ వసతి పొందుతున్న విద్యార్థులకు ఇతర ప్రాంతాల్లోని వసతి గృహాలకు తరలించారు. త్వరలోనే మరమ్మతులు చేపట్టి ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు నేటికీ ఎస్సీ విద్యార్థులకు వసతి గృహం అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ శిథివస్థకు చేరుకున్న భవనాలోనే ప్రస్తుతం స్కిల్ హబ్ పేరుతో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నారు. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఓ చిన్నపాటి భవనాన్ని నిర్మించి వినియోగిస్తున్నారు.

పాత వసతిగృహంపై అంతస్తు వినియోగానికి అనువుగా ఉండడంతో దాన్ని స్కిల్ హబ్​కి వినియోగించుకుంటున్నారు. భవనం నిర్వాహణ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు గాలికొదిలేయడంతో చెత్తా, మురుగు, పిచ్చిమొక్కలతో పడైపోయిన బంగళాని తలపిస్తోంది. దోమలు, ఈగలు అధిక సంఖ్యలో చేరడంతో ఇక్కడ శిక్షణ పొందే యువత అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్నపాటి వర్షం వచ్చినా మురుగు నీరు భవనంలోకి చేరుతోంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏ క్షణంలోనైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తమకు ప్రభుత్వం వినియోగించుకోమని ఈ భవనాన్ని కేటాయించదని స్కిల్ హబ్ ప్రతినిధులు చెబుతున్నారు. చిన్నపాటి మరమ్మతులు చేపట్టి ప్రస్తుతం ఈ భవనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు.

Government Hostel Problems: శిథిలావస్థకు హాస్టళ్లు​.. ప్రాణభయంతో విద్యార్థులు

అద్దె భవనాల్లో అంగన్వాడి కేంద్రం : కబేళా సెంటర్ సమీపంలో అంగన్వాడీ కేంద్రం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. కొన్ని నెలల క్రితం ఈ భవనాన్ని ఖాళీ చెయ్యించి అంగన్వాడీ సెంటర్​ని వేరే అద్దె భవనంలోకి (Anganwadi Center in Rented Buildings) మార్చింది. ఈ భవనాన్ని చిన్నపాటి మరమ్మతులు చేపట్టి సామాజిక భవనంగానో, అంగన్వాడీగానో, సచివాలయంగానే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నా అధికారులు, స్థానిక ప్రజాప్రనిధులు దీనిపై దృష్టి సారించడం లేదు. వేలాది రూపాయలు అద్దె చెల్లించి ఇతర భవానాల్లో అంగన్వాడి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో వేలాది రూపాయలు ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు, ప్రజాసంఘాలు ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కబేళా కేంద్రం, వసతిగృహం, అంగన్వాడీ కేంద్రాల వినియోగం, అభివృద్ధి పట్ల దృష్టి సారించాలని స్థానికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

Avanigadda MRO Building in Dilapidated Condition.. జగనన్న..! అవనిగడ్డ కొత్త ఎమ్మార్వో కార్యాలయం ప్రారంభానికి అడ్డేంటన్న?

ABOUT THE AUTHOR

...view details