Devineni Uma: జగన్ రెడ్డి చేతగానితనం వల్లే పోలవరం నిర్మాణంపై చేతులెత్తేశాడని మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ధ్వజమెత్తారు. 2024 నాటికి ప్రాజెక్ట్ నిర్మించలేమని వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. జగన్ తప్పులు, పాపాలు పోలవరానికి, రాష్ట్ర రైతులకు శాపంగా మారాయని ఆరోపించారు. పోలవరం పూర్తైతే, రాష్ట్రానికి యూనిట్‌కి 20రూపాయల చొప్పున విద్యుత్ కొనే దుస్థితి వచ్చేదికాదని అన్నారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు పట్టించుకోకపోవటం వల్లే.. 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ పనుల్లో ఆటంకం కలిగిందని ఆరోపించారు.
పోలవరం, రైతులకు.. జగన్ తప్పులు శాపంగా మారాయి: దేవినేని ఉమా - దేవినేని ఉమా
Devineni Uma: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం 2024వరకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాదని చెప్పటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణం 70శాతం వరకు పూరైందన్న కేంద్ర ప్రకటనపై ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
దేవినేని ఉమా
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రేమతో ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించినప్పుడే జగన్ బాగోతం అర్థమైందని ఉమా అభిప్రాయపడ్డారు. పోలవరం పునాదులే లేవలేదని ఆరోపించిన జగన్, మంత్రులు.. ప్రాజెక్ట్ నిర్మాణం 72శాతం పూర్తయిందన్న కేంద్ర ప్రకటనపై ఏం చెబుతారని ప్రశ్నించారు. పోలవరంతో పాటు సీమ ప్రాజెక్ట్‌ల పనులు నిలిపేసిన జగన్.. నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 9, 2022, 6:55 PM IST