DEPUTY CM NARAYANA SWAMY ON LIQUOR SALE: మద్యం విక్రయాల్లో విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, కడప జిల్లాలు ఏప్రిల్ -నవంబర్ మధ్య తక్కువ రెవెన్యూ నమోదు చేసినట్టు అబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి స్పష్టం చేశారు. వచ్చే నాలుగు నెలల్లో ఈ జిల్లాలు లక్ష్యాన్ని చేరుకోవాలని .. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలని ఆదేశించారు. మరోవైపు మద్యపాన నియంత్రణ దిశగా కఠినంగా వ్యవహరించాలంటూ మంత్రి సూచించారు. మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపటంతో పాటు తయారీదారులకు ప్రత్నామ్నాయ ఉపాధి కల్పించేలా పరివర్తన పథకాన్ని అమలు చేయాలని సూచించారు. ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో అక్రమాలు సహించబోమని మంత్రి తేల్చి చెప్పారు. మాదకద్రవ్యాలు, గంజాయి రవాణాపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలిచ్చారు.
ఆ జిల్లాల్లో మద్యం విక్రయాలపై తక్కువ రెవెన్యూ : మంత్రి నారాయణ స్వామి - అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి
EXCISE MINISTER NARAYANA SWAMY : రాష్ట్రంలోని పలు జిల్లాలో ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో మద్యం విక్రయాల్లో తక్కువ రెవెన్యూ నమోదు చేసినట్లు అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపటంతో పాటు తయారీదారులకు ప్రత్నామ్నాయ ఉపాధి కల్పించేలా పరివర్తన పథకాన్ని అమలు చేయాలని సూచించారు.
EXCISE MINISTER NARAYANA SWAMY