అక్షయ తృతీయ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు బంగారు ఆభరణాల దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా యనమలకుదురులోని ఓ జ్యుయలరీ షాపులో నాణ్యత లేని తూకం పరికరం వినియోగిస్తున్నారని గుర్తించి... సీజ్ చేశారు. వినియోగదారులు బంగారం కొనేటప్పుడు ఆభరణాల నాణ్యతను తప్పనిసరిగా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు . తూనికల్లో అక్రమాలు జరిగితే తమకు ఫిర్యాదు చేయాలని తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీనివాస నాయుడు తెలిపారు.
'బంగారు ఆభరణాలు కొనేటప్పుడు.. అవి తప్పకుండా చూసుకోవాలి' - gold jewelry news
అక్షయ తృతీయ సందర్భంగా... పలు బంగారు ఆభరణాల దుకాణాల్లో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. వినియోగదారులు బంగారం కొనేటప్పుడు.. ఆభరణాల నాణ్యతను తప్పనిసరిగా చూసుకోవాలని సూచించారు. తూనికల్లో అక్రమాలు జరిగితే తమకు ఫిర్యాదు చేయాలన్నారు.
శ్రీనివాస నాయుడు