Municipal Workers Problems : ఎన్నికల సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినహామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు ప్రచార జాతాలు నిర్వహిస్తున్నామని ప్రకటించింది. మే 31వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి రెండు ప్రచార జాతాలను ప్రారంభిస్తున్నామని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికులు కరోనా సమయంలో కూడా పట్టణాలను, పర్యవరణాన్ని పరిరక్షించడానికే పాటుపడ్డారనీ, ఇప్పటికీ పర్యావరణ రక్షణ కోసం పని చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రచాల జాతంతో భాగంగా 123 మున్సిపాలీటీలకు వెళతామని, అక్కడ కార్మికుల సమస్యలను తెలుకుంటామన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆప్కాస్ అని కొత్త వ్యవస్థని తీసుకువచ్చిఔట్ సోర్సింగ్ కార్మికులను బలి పశువులను చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింంగ్ కార్మికులు చేసే పని రిస్క్‌తో కూడుకున్నదని, వాళ్లకు హెల్త్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ కల్పించాలని కోరారు. జీతాలు కూడా నామమాత్రంగా ఇస్తున్నారని, ఉద్యోగులు అనే పేరుతో సంక్షేమ పథకాలు కోత విధించడం సరైన పద్దతి కాదని ఆయన అన్నారు.
Councillors meeting: సమస్యల పరిష్కారానికి ఛైర్మన్ కు విన్నపాలు.. అధికారులపై ఆరోపణలు...
మున్సిపల్ కార్మికులు పని చేయడానికి పనిముట్లు లేవని, పనిముట్లను కుడా కార్మికులే కొనుకోవాల్సి వస్తుందని, రక్షణ పరికారలు లేవని కె.ఉమామహేశ్వర రావు అసహనం వ్యక్తం చేశారు. భద్రత సౌకర్యాలు లేవని, ఖాళీలు భర్తీ చేయటం లేదని, ప్రస్తుతం ఉన్న కార్మికులపైన అదనపు భారం పడుతుందని, కార్మికుల అన్ని సమస్యలపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతాని ఆయన అన్నారు.
ఆప్కాస్ వద్దు.. 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. క్లాప్ వాహనాల డ్రైవర్లకు కనీస వేతనం 18,500 రూపాయులు ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్స్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, అన్ని నగరపాలక సంస్థల్లో పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని డిమాండ్ చేశారు. జూన్ 8వ తేదీన ప్రచార జాత ముగింపు సభను విజయవాడలో నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని నగరపాలక సంస్థల్లో ప్రచార జాతాలను నిర్వహిస్తామన్నారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ "ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆప్కాస్ అని కొత్త వ్యవస్థని తీసుకువచ్చి ఔట్ సోర్సింగ్ కార్మికులను బలి పశువులను చేస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చే రిటైర్మెంట్ సద్వినియోగాలు, పింఛను ఏ ఒక్క ప్రయోజనం నెరవేర్చలేదు. ఇంజనీరింగ్ కార్మికులు చేసేది రిస్క్‌తో కూడుకున్న పని, వాళ్లకు హెల్త్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్ లేదు. జీతాలు కూడా నామమాత్రంగా ఇస్తున్నారు. ఉద్యోగులు అనే పేరుతో సంక్షేమ పథకాలు కోత పెట్టారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 ఇవ్వకుండా 11 వేలు, 12 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు."- కె.ఉమామహేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Clap Vehicle Drivers Dharna: పీఎఫ్ బకాయిలు చెల్లించాలని క్లాప్ వెహికల్ డ్రైవర్ల ధర్నా