Deaths in State Due to TDP Chief Chandrababu Remand:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఆదివారం రిమాండుకు తరలించిన వార్త విని హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానంద నగర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు ఆదివారం గుండెపోటుతో(TDP Followers Died to Heart Attack) మృతి చెందారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఎస్. ఎర్రగుడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సి. సుభాన్ కన్నుమూశారు. టీవీ, సెల్ఫోన్లో సంబంధిత వార్తలను చూస్తూ, మంచి నాయకునికి ఇలా జరిగిందేంటా అని రెండు రోజులుగా దిగులు పడుతూ ఉన్నారు. ఆ క్షోభతోనే ఆదివారం రాత్రి గుండె పోటుతో తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. మృతుడికి భార్య జమీల, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
TDP Followers Died Due To CBN Arrest :పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దివ్యాంగుడు తాడేపల్లి శేఖర్ చంద్రబాబు అరెస్టు, తదనంతర దృశ్యాలను టీవీలో చూస్తూ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దీంతో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందారు.
TDP Followers Died of Heart Attacks After Seeing the News Chandrababu Arrest :ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన వ్యవసాయ కూలీ భీమడోలు వెంకయ్య.. చంద్రబాబును ఎంతో అభిమానించేవారు. ఆయన అరెస్టు విషయం తెలుసుకున్నపుడే స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సోమవారం ఏలూరు, అక్కడ నుంచి విజయవాడ తీసుకెళుతుండగా మార్గమధ్యలో కన్ను మూశారు.
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కత్తాపల్లెకు చెందిన టీడీపీ అభిమాని శంకరప్ప ఆదివారం రాత్రి చంద్రబాబు అరెస్టును టీవీలో చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు పుంగనూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు రోజులుగా టీవీ చూస్తూ ఆయన తీవ్రంగా మదన పడేవారని కుటుంబీకులు పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్టు..తోటి కోడళ్లు మృతి :చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో వరుస పరిణామాలను చూసి అనకాపల్లి జిల్లా జె.పి. అగ్రహారం గ్రామానికి చెందిన వితంతువు సుర్ల నారాయణమ్మ గుండె ఆగిపోయింది. ఆదివారం రాత్రి టీవీలో వార్తలు చూస్తూ ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అలానే విలపిస్తూ నిద్రలోకి జారుకున్న ఆమె తిరిగి లేవలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామానికి చెందిన ఉల్లురి అప్పల నరస, ఉల్లూరి మంగయమ్మ గుండెపోటుతో మరణించారు. ఇద్దరు తోటి కోడళ్లు ఒకేరోజు మరణించడంతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వీరన్న చంద్రబాబు అరెస్టు వార్తలు విని ఈ నెల 9న గుండెపోటుకు గురయ్యారు. కర్నూలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు.
నంద్యాల జిల్లా గోస్పాడు ఎస్సీ కాలనీకి చెందిన టీడీపీ అభిమాని సాదె లింగమయ్య రెండు రోజులుగా టీవీలో చంద్రబాబు అరెస్టు వార్తలు చూసి తీవ్ర మనస్తాపం చెందారు. సోమవారం ఉదయం టీవీ చూస్తూ ఒక్కసారిగా కుప్ప కూలి మరణించారు.