Damage Roads in AP :రాష్టంలో రహదారులన్నీ పూర్తిగా బాగు చేయాలి. కొత్తగా వేస్తున్నవి. నాణ్యంగా ఉండాలి. అధిక నిధులు ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా వీటిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా విషప్రచారం చేస్తున్నారు. వారి కడుపు మంటకు మందులేదు. అందుకే మనం చేస్తున్న అభివృద్ధిని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలి. రహదారులను బాగుచేశాక అవి ఎలా ఉన్నాయో తెలిపేలా 'నాడు నేడు' ద్వారా చిత్రాలను ప్రజల ఎదుట ప్రదర్శించాలి. ఈ ఏడాది జనవరి 23న రహదారులపై అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యలివి. ఆహా ఇది వింటే రాష్ట్రంలో రోడ్లన్నీ మిలమిల మెరిసిపోతున్నాయని అనుకుంటున్నారేమో! ఈ సమీక్ష జరిగి 8 నెలలవుతోంది.
Deteriorated Roads Across the State in YSRCP Government : రాష్ట్రంలో కొత్త రోడ్ల సంగతేమో గాని.. రోజురోజుకు రాటుతేలుతు రహదారులు గుంతలతో, అత్యంత దయనీయంగా ఎందుకు మారాయో? సీఎంకే తెలియాలి. విపక్షాల్లో కడుపుమంట అంటూ జగన్ వ్యాఖ్యానించగా, రోడ్లు విషయంలో ప్రజల కడుపుమంట ఏ స్థాయిలో ఉందో ఎవరిని అడిగినా తెలుస్తుంది. మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఏ ఊరెళ్లిన ప్రజలురోడ్లవిషయంలో నిలదీస్తూ ఎక్కడికక్కడ కడిగి పారేస్తున్నారనే విషయాన్ని సీఎం జగన్ మరచిపోతున్నారేమో? రోడ్ల కోసం నిధులు ఖర్చు పెట్టేందుకు ఈ ప్రభుత్వానికి ఎలాగూ మనసు రావడం లేదు. కనీసం రోడ్ల అభివృద్ధి పేరిట వాహనదారుల నుంచి ఏటా పన్ను రూపంలో 600 కోట్లు వసూలు చేస్తున్నా వాటితో కనీసం గుంతలు ఎందుకు పూడ్చడం లేదో జగనే చెప్పాలి
.
AP Government Neglecting the Expansion of Roads: 'సీఎం గారు ఒక్కసారి నింగి నుంచి నేలకు దిగండి.. మా కష్టాలు చూడండి'
రాష్ట్రంలో రహదారుల దుస్థితి గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. బైక్, ఆటో, కారు, బస్సు ఇలా ఎందులో ప్రయాణించినా మన రోడ్లు నరకాన్ని చూపిస్తున్నాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు మొక్కుబడిగానే ఉంటోంది. కనీసం రహదారి అభివృద్ధి సెస్సు కింద వసూలు చేస్తున్న సొమ్ము కూడా ఖర్చు చేయకుండా జగన్ సర్కార్ ఏం చేస్తోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. రహదారుల అభివృద్ధి, మరమ్మతుల కోసమని చెబుతూ వైసీపీ ప్రభుత్వం 2020, సెప్టెంబర్‌లో రహదారి అభివృద్ధి పన్ను విధించింది.
YSRCP Government Can Not Repair Roads : పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి అదనంగా పన్ను రూపంలో వసూలు చేయడం ఆరంభించారు. నెలకు 50 కోట్ల రూపాయల చొప్పున ఏటా 600 కోట్లు ఈ పన్ను ద్వారా వస్తోంది. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 1800 కోట్ల రూపాయలు వసూలైంది. ఈ సొమ్మంతా ఏటా క్రమం తప్పకుండా వెచ్చిస్తే రోడ్లపై గుంతలు లేకుండా చేయొచ్చు. రహదారుల నిర్వహణ పనులకూ నిధుల కొరత ఉండదు. బకాయిలిస్తేగానీ మరమ్మతులు చేయబోమంటూ గుత్తేదారులు ప్రతిసారీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, వారికి ఈ పన్ను డబ్బులతో చెల్లింపులు చేస్తే గుంతలు పూడ్చేందుకు ముందుకొస్తారనేది జగన్‌కు తెలియంది కాదు.
Tribals Four KMs Doliyatra for Roads: 'పలకరా అన్నలూ..ఎన్నాళ్లీ డోలీ మోతలు'.. వినూత్నంగా గిరిజనుల నిరసన
రాష్ట్రంలో అత్యంత ఘోరంగా మారిన 7,649 కిలోమీటర్ల మేర రహదారులను పునరుద్ధరించేందుకు 2,205 కోట్ల రూపాయల వ్యయమవుతుందని రెండేళ్ల కిందట ప్రభుత్వం అంచనా వేసింది. దీనికోసం రహదారి అభివృద్ధి పన్నును హామీగా చూపించి 2 వేల కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. అయినా గుత్తేదారులకు వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం కలగలేదు. ఆ రుణాన్ని ప్రభుత్వం వాడేసుకుంటుందని, పనులు చేశాక బిల్లులు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తుందన్న ఉద్దేశ్యంతో గుత్తేదారులు బిడ్లు వేసేందుకు వెనకడుగు వేశారు.
దీంతో బ్యాంకు నుంచే నేరుగా చెల్లింపులు చేసేలా ప్రత్యేక ఏర్పాటు చేస్తే గానీ, గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రాలేదంటే జగన్ సర్కార్‌పై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. ఈ పనుల విషయంలో కూడా ప్రభుత్వం తనదైన శైలిని ప్రదర్శిస్తోంది. బ్యాంకు రుణంలో 1,900 కోట్ల మేర గుత్తేదారులకు చెల్లింపులు చేసినా, ప్రభుత్వం మాత్రం తన వాటా 205 కోట్లలో చెల్లింపులేమీ చేయలేదు. దీంతో బ్యాంకు తన రుణంలో మిగిలిన 100 కోట్లను నిలిపివేసింది.
చివరకు ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకర్లను ఒప్పించి మిగిలిన రుణాన్ని విడుదల చేసేలా చూశారు. ఇదంతా జరిగి ఏడాదయ్యాక రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇటీవల విడుదల చేసింది. పన్ను హామీతో రుణం తెచ్చి ఒకసారి రోడ్ల పనులు చేయించినా, అదే పన్నుతో గుత్తేదారులకు ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లింపులు కూడా చేయలేకపోయింది.
Damaged roads in AP: అడుగుకో గుంత.. అధ్వానంగా గన్నవరం-మానికొండ రహదారి
Damage Roads in AP: పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూపాయి చొప్పున పన్ను వసూలు.. రోడ్ల మరమ్మతులు చేపట్టని ప్రభుత్వం