Dalit lands were captured by Somu Virraj : విజయవాడ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 33వ పుస్తక మహోత్సవంలో మంగళవారం రసాభాస చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా పుస్తక మహోత్సవ ప్రాంగణంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించిన రాష్ట్ర దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులను పోలీసులు నిలువరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఎదుట దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నాయకులు లక్ష్మీపతిరాజా, వల్లభనేని సుధాకర్‌లు దళితుల భూములను కబ్జా చేసి, దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, ఆ భూముల్లోకి రానీయకుండా దౌర్జన్యం చేయిస్తున్నారంటూ నినాదాలు చేశారు. ఈ విషయమై మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వారు ప్రయత్నించగా.. ఆయన దానిని తీసుకోకుండా వెళ్లిపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దళిత సంఘాల నాయకులు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మాట్లాడుతూ.. ‘గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ చినకాకాని గ్రామ పంచాయతీ పరిధిలో డీ నెంబరు 233/బిలో 4404 చదరపు గజాల భూమిని 2014లో దళిత సామాజిక వర్గానికి చెందిన గొల్ల వరప్రసాద్ కొనుగోలు చేశారు.