Dalit Community Leaders Meeting on Kodi Kathi Srinu Case:సీఎం జగన్ ప్రతీసారి నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ దళితులకు వెన్నుపొటు పొడుస్తున్నారని దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. 2019 ఎన్నికల్లో అధికారం కోసం ఒక దళిత యువకుడిని బలి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎంత పెద్ద నేరస్తుడికైనా న్యాయస్థానం బెయిల్ ఇస్తుందని కానీ కొడికత్తి కేసులో మాత్రం జన్నుపల్లి శ్రీనుకు బెయిల్ రావడం లేదని వారు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. జన్నుపల్లి శ్రీను (కొడికత్తి శ్రీను)కు బెయిల్ మంజురు చేసి, విడుదల చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులతో పాటు దళిత, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కోడి కత్తి దాడి కేసులో కుట్రకోణం లేదు - సరైన కారణం చూపకుండా జగన్ హైకోర్టును ఆశ్రయించారు : ఎన్ఐఏ
2018 నుంచి కోడికత్తి కేసులో జరుగుతున్న పరిణాలమాలు సీఎం జగన్ వ్యవహరిన్తున్న తీరుపై దళిత సంఘాల ప్రతినిధులు చర్చించారు. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఉద్యమ భవిష్యత్ కార్యచరణను నేతలు సిద్దం చేశారు. 2018లో ఘటన జరిగితే ఇప్పటి వరకు జన్నుపల్లి శ్రీనుకి బెయిల్ రాలేదని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు వాపోయారు. ఎన్ఐఏ కూడా ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని చెప్పిందని గుర్తు చేశారు. ఆర్ధిక కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ ఆ కేసుల్లో విచారణకు వెళ్లడం లేదని అలాగే సాక్షిగా ఉన్న కేసుల్లో కూడా విచారణకు హాజరు కావడం లేదని విమర్శించారు. శ్రీనుకు బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలను ఎకతాటిపైకి తీసుకువచ్చి దశల వారి పోరాటానికి సిద్దం అవుతున్నామని చెప్పారు.