SC, ST Round Table Meeting: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు జనవరి 23తో ముగుస్తున్నందున ఆ చట్టాన్ని శాశ్వతంగా కొనసాగించాలని దళిత, గిరిజన సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రెస్ క్లబ్లో దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ దళిత గిరిజన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు.
'ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది' - విజయవాడ వార్తలు
Dalit and Tribal Communities: దళిత గిరిజనుల సమగ్రాభివృద్ధి - సాధికారతకోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చారని, ఈ చట్టాన్ని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆరోపించాయి.
!['ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది' Dalit and tribal communities](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17537522-886-17537522-1674223567423.jpg)
చట్టం కొనసాగింపు కోసం అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దళిత గిరిజనుల సమగ్రాభివృద్ధి - సాధికారత కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తెచ్చారని, ఈ చట్టాన్ని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దళిత, గిరిజన సంఘాలు ఆరోపించాయి. నిధులను ఇతర అవసరాలకు మళ్లించాయని ఆక్షేపించారు. సబ్ ప్లాన్లో బడ్జెట్లో కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన నిధులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించేలా పర్యవేక్షణ చేయడం కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి