Heavy Cyber Crime in Vijayawada :సైబర్ నేరగాళ్లు ఎప్పుడికప్పుడు కొత్త ఎత్తులతో బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పంథాను మార్చి అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. విజయవాడలో సూర్యారావు పేటలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యానికి.. ముఖ్యమంత్రి కార్యాలయం (Chief Minister Office) నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. తన పేరు నాగేశ్వర్ రెడ్డి అని.. ఆసుపత్రులు, రెసిడెన్షియల్ ప్లాట్స్ నిర్మాణం నిమిత్తం భూమి కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. మీ దస్త్రాన్ని సదరు కార్పొరేట్ ఆసుపత్రి ఎండీకి పంపించినట్లు నమ్మించాడు. నిజమని నమ్మిన ఆసుపత్రి యాజమాన్యం అపరిచిత వ్యక్తి చెప్పిన ఐడీలకు విడతల వారీగా 3 లక్షల రూపాయలు చెల్లించారు. ఆ తరువాత షరా మామూలుగానే..సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) టోకరా వేశారని తెలిసుకుని న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
APP Cheating మాకో యాప్ ఉంది.. దానికో స్కీం ఉంది! విజయవాడ కేంద్రంగా మరో ఆన్లైన్ దగా!
Vijayawada People Worried About Cyber Criminal Cheaters :పటమట పోస్టల్ కాలనీకి చెందిన శివరామ కృష్ణ అనే వృద్ధుడికి మాక్స్ లైఫ్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామని ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసారు. గతంలో తీసుకున్న బీమా విషయం గురించి మాట్లాడుతూ.. సిలిగురి శాఖలో కొంత మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారని దీనిపై కోర్టులో కేసు కూడా నమోదైందని నమ్మించారు. మీరు తీసుకున్న బీమా పాలసీ వివరాలు చెబితే పాలసీకి చెందిన 24లక్షలు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. శివరామ కృష్ణ అదంతా నమ్మడంతో పాలసీ రెన్యువల్, పన్నులు, పెన్షన్ ప్లాన్ పేరుతో ఏడున్నర లక్షల వరకు బాధితుని నుంచి సైబర్ కేటుగాళ్లు దోచేశారు. ఎవరికైనా ఈ విధమైన ఫోన్లు, మెయిల్స్ వచ్చినపుడు పరిశీలించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.