ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనవరి 26 నాటికి ఆరోగ్యశ్రీ నూతన వెబ్‌సైట్ సిద్ధం చేయండి: సీఎస్ జవహర్ రెడ్డి - 26 నాటికి ఆరోగ్యశ్రీ నూతన వెబ్‌సైట్ సిద్ధం చేయండి

CS key instructions to health department officers: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. జనవరి 26వ తేదీ నాటికి ఆరోగ్యశ్రీ నూతన వెబ్‌సైట్​తో పాటు మొబైల్ యాప్‌లను సిద్ధం చేయాలని ఆదేశించారు.

AP health officers
వైద్యారోగ్యశాఖ అధికారుల సమీక్ష

By

Published : Jan 13, 2023, 10:30 PM IST

CS key instructions to health department officers: జనవరి 26వ తేదీ నాటికి ఆరోగ్యశ్రీ నూతన వెబ్‌సైట్ సహా మొబైల్ యాప్‌లను సిద్ధం చేయాలని..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. మార్చినాటికి ప్రాధాన్యతా క్రమంలో అయిదు వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌లోని సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా సూచనలు చేశారు.

మరోవైపు ఆరోగ్యశ్రీ అమలుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో కియోస్కులను ఏర్పాటును కూడా జనవరి 26 నాటికి పూర్తి చేయాలని సూచించారు. విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఈ మార్చికల్లా పూర్తిచేయాలని ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను క్లైయిమ్ చేసేందుకు, పెండింగ్‌లో ఉన్న పలు బిల్లులను చెల్లించేందుకు ఆర్థిక సంఘం నిధులు రూ.275 కోట్లను ఈ నెలాఖరు కల్లా విడుదల చేయాలని సూచించారు.

అనంతరం ఆరోగ్య సేవలు, ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి సారూప్యత ఉన్న బడ్జెట్ హెడ్‌లను విలీనం చేయాల్సిందిగా సూచించారు. ఆస్పత్రుల్లో పారిశుద్ద్య నిర్వహణతో పాటు డైట్, తాగునీరు, విద్యుత్, లాండ్రీ సర్వీస్ చార్జీల చెల్లింపునకు అవసరమైన అదనపు నిధుల మంజూరుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ దిశానిర్దేశం చేశారు. మహాప్రస్థానం వాహనాలతో పాటు 104, 108 అంబులెన్సు సేవల నిర్వహణ బాధ్యతలను ఎన్.జి.ఓ.లకు అప్పగించే విధంగా చర్యలను చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details