ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఏమైంది?' - తెలుగు తాజా వార్తలు

CPM State Secretary Coments On YS Jagan: విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్మార్ట్, ప్రిపెయిడ్ మీటర్లు పేరుతో రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల భారాలు వైసీపీ ప్రభుత్వం మోపుతుందని ఆయన మండిపడ్డారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 5, 2023, 7:44 PM IST

CPM State Secretary Coments On YS Jagan: స్మార్ట్, ప్రిపెయిడ్ మీటర్లు పేరుతో రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల భారాలు వైసీపీ ప్రభుత్వం మోపుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఆర్ఆర్ అనుమతి లేకుండా మీటర్ల కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం, వ్యవసాయ మీటర్లపై సర్వే నివేదిక బయట పెట్టాలన్నారు. ట్రూఅప్ చార్జీలు చట్ట విరుద్ధమని.. ఏఆర్ఆర్​కు పంపిన నివేదికలో డిస్కంలు 3 వేల కోట్ల భారాన్ని చూపించాయని.. వీటిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. ఎన్నికల ముందు 200 యూనిట్లలోపు వాడుకునే వారికి ఉచితంగా విద్యుత్ ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. ప్రభుత్వం బ్రిటిష్ చట్టాలను అమలు చేస్తోందని 1861 పోలీస్ రూల్స్ ప్రకారం జారీ చేసిన జీవో 1ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ట్రూ-అప్ ఛార్జీల పేరుతో 3 వేల కోట్ల భారాన్నిప్రజలపై మోపింది: శ్రీనివాసరావు

ABOUT THE AUTHOR

...view details