CPI Ramakrishana: అమరావతి రాజధాని ధ్వంసమే.. వైకాపా ధ్యేయంగా ఉందని, రాజధాని అంశంపై వైకాపా నాయకులు పదేపదే వివాదాలు సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజానీకానికి వారు చేస్తున్న ద్రోహాన్ని.. మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లగక్కడమే అందుకు నిదర్శనమని విమర్శించారు. ఎన్నికలెప్పుడు జరిగినా.. వైకాపా ఇంటికెళ్లక తప్పదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఎవరేమనుకున్నా వచ్చే నెలలో విశాఖ నుంచి పాలన ఉంటుందని రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోమారు స్పష్టం చేశారని అన్నారు. మూడు రాజధానులు అని బూటకపు మాటలతో వైకాపా.. రాష్ట్ర ప్రజలను ఇన్నాళ్లూ మభ్యపెట్టిందనేది ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలతో బహిర్గతమవుతోందని విమర్శించారు. విశాఖ రాజధానిని తరలిస్తున్నామని చెప్పలేక ఇలా అంటున్నారన్నారు.
అమరావతి ధ్వంసమే.. వైకాపా ధ్యేయం: సీపీఐ నేత రామకృష్ణ - సీపీఐ రామకృష్ణ వైకాపాపై వ్యాఖ్యలు
CPI Ramakrishana: రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖ రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలపై.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాష్ట్ర ప్రజలను వైకాపా మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. విశాఖకు రాజధానిని తరలిస్తున్నామని చెప్పే ధైర్యం వైకాపాకు లేదని దుయ్యబట్టారు.
సీపీఐ రామకృష్ణ