ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: రామకృష్ణ - ఏపీ రాష్ట్రం అప్పులు ఏటా 45వేల కోట్లు

CPI RamaKrishna: కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాష్ట్ర అప్పు రూ.4.42 లక్షల కోట్లకు చేరిందని, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేవలం రూ.1.35 లక్షల కోట్లు అని అంటున్నారు. ఇందులో ఏది నిజం తెలియాలంటే రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 8, 2023, 4:45 PM IST

CPI RamaKrishna: రాష్ట్ర అప్పులు, వడ్డీల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ అప్పు రూ.4.42 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారని,.. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర అప్పు కేవలం రూ.1.35 లక్షల కోట్లు మాత్రమే అని ప్రకటించారని, వీటిలో ఏది నిజమని ప్రశ్నించారు. వివిధ కార్పొరేషన్ లు, తదితరాల ద్వారా చేసిన అప్పులతో కలిపి దాదాపు రూ.10 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రతి నెల ఒకటో తేదీకి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ చెల్లింపు కూడా ప్రతి నెల సక్రమంగా చెల్లించకపోవడంతో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసలు రాష్ట్ర అప్పులు, వడ్డీల చెల్లింపులపై నిజనిజాలు వెల్లడించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: రామకృష్ణ

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details