CPI Ramakrishna reacted to Bhaskar Reddy arrest: వివేకా హత్యకేసుపై సీఎం జగన్ ఇప్పటికైనా స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటికైనా స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. వివేకానందరెడ్డి హత్యకేసు విషయంలో నాలుగేళ్ల కాలయాపన అనంతరం వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందన్నారు. ఈ కేసు పురోగతి సాధించడంలో సీబీఐకి నాలుగేళ్లు పట్టిందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో... ఆయన శవానికి కట్లుకట్టి, సహజ మరణంగా ఎవరు చిత్రీకరించాలనుకున్నారో... అన్ని విషయాల గురించి అక్కడ అందరికీ తెలుసు. పోలీసుల దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ప్రాథేయపడి, ప్రసన్నం చేసుకోవడంవల్లే ఈ కేసు పురోగతి నెమ్మదించి, ఇన్నాళ్లు పట్టిందన్నారు. సీబీఐ వారు ఈ నెలాఖరులోపు ఈ కేసును పూర్తిచేసి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ ఆలస్యంగానైనా అరెస్ట్ చేసింది. సీబీఐ నాలుగు సంవత్సరాల పాటు కాలయాపన చేసినప్పటికీ, వైఎస్ భాస్కర్‌రెడ్డిని చివరకు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పదేపదే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమితాను ప్రాథేయపడి ప్రసన్నం చేసుకోవడంవల్లే ఈ కేసు పురోగతి నెమ్మదించింది. నేడు సీబీఐ అధికారులు ఎట్టకేలకు భాస్కరరెడ్డిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ అంశంపై వెంటనే స్పందించాలి. వివేకా హత్యకేసులు అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయి. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి