CPI leader Ramakrishna criticized: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి మరోసారి మొండిచేయి చూపిన వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా.. వైకాపా ఎంపీలతో తక్షణమే రాజీనామా చేయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. పార్లమెంటు సభ్యులను ఎక్కువమందిని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని, విభజన అంశాలు అమలయ్యేలా కృషి చేస్తానని 2019 ఎన్నికల్లో సీఎం జగన్ ప్రగల్భాలు పలికారని రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో తన కేసుల విముక్తి కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి ప్రధాని మోదీ ఎదుట సాగిలపడే పరిస్థితికి దిగజారారని ఆయన విమర్శించారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన విశాఖ సభ... ప్రధానిని ప్రసన్నం చేసుకోవడానికి ఆడిన డ్రామా తప్ప, దానివల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించిన ఏ ఒక్క అంశంపై మోదీ స్పందించలేదన్నారు.
Visakha Sabha: మోదీ ప్రసన్నం కోసం జగన్ పాట్లు: సీపీఐ నేత రామకృష్ణ - CPI leader Ramakrishna criticized news
CPI leader Ramakrishna: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి మరోసారి మొండిచేయి చూపారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. మోదీని ప్రసన్నం చేసుకోవడానికే జగన్ ఆడిన డ్రామా అంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించిన ఏ ఒక్క అంశంపై మోదీ స్పందించలేదన్నారు.
![Visakha Sabha: మోదీ ప్రసన్నం కోసం జగన్ పాట్లు: సీపీఐ నేత రామకృష్ణ CPI leader Ramakrishna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16912286-765-16912286-1668270168347.jpg)
విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విభజన హామీలు అమలు చేసే అంశాలపై ఏ ఒక్కదానిపై కూడా ప్రధాని తన ప్రసంగంలో కనీసం ప్రస్తావించలేదన్నారు. మోదీ చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయారని తెలిపారు. ఆయన పర్యటన వల్ల రాష్ట్రానికి మేలు జరిగే ఏ ఒక్క అంశంపైగాని, సీఎం ప్రస్తావించిన వాటిపై కాని సమాధానం చెప్పలేదన్నారు. విశాఖ సభ విజయవంతం కోసం దాదాపు 7వేల మంది అధికారులను వినియోగించారని విమర్శించారు. జన సమీకరణకు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి రాష్ట్రానికి సాధించిందేమిటో ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలని తెలిపారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై జగన్ ఇప్పటికైనా గళమెత్తాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: