ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

gps vs cps: జీపీఎస్‌ విధానానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం: సీపీఎస్ ఉద్యోగ సంఘాలు

cps employees: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్ విధానానికి ఒప్పకునేది లేదని సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. విజయవాడలో సమావేశమైన.. సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వం వెంటనే పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పాత పింఛన్‌ సాధనకు, ఇకపై ఐక్య పోరాటాలు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 19, 26వ తేదీన 'స్పందన'లో... వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఫిర్యాదులు చేస్తామని తెలిపారు.

gps vs cps
gps vs cps

By

Published : Jun 18, 2023, 7:44 PM IST

cps employees Meeting: సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేయాలని సీపీఎస్ ఉద్యోగులు నిర్ణయించారు. ఇప్పటివరకు విడివిడిగా పోరాడిన ఉద్యోగ సంఘాలు ఇకపై కలసి పోరాడాలని నిర్ణయించారు. ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ ను వెనక్కి తీసుకుని, హామీ నేరవేర్చే వరకు పెద్దఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఓపీఎస్ సాధించి తీరతామని, అప్పటివరకు వెనుతిరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఉద్యోగులు... తమను దారుణంగా మోసం చేసిన 4 జేఎసీ సంఘాల నుంచి సీపీఎస్ బయటకు రావాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం లోనే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామన్న వైఎస్ జగన్.. నిలువునా మోసం చేశారని మండి పడ్డారు. మాట ఇచ్చి మడమ తిప్పడమే కాకుండా... నమ్మి ఓట్లేసిన ఉద్యోగులను వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓపీఎస్ సాధన కోసం పోరాటం: సీపీఎస్ రద్దు చేసి దాని స్థానంలో గ్యారెంటీ పింఛన్ స్కీం.. జీపీఎస్ ను అమలు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై సీపీఎస్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని జేఎసీ నేతలు స్వాగతించడం, ముఖ్యమంత్రి ని అభినందనలు తెలపడంతో ఆగ్రహించిన సీపీఎస్ ఉద్యోగులు ఇవాల విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విజయవాడ జరిగిన సమావేశంలో ఎపీసీపీఎస్ ఈఎ, ఎపీ సీపీఎస్​యూఎస్, సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం, సహా సీపీఎస్ కోసం పోరాడుతోన్న పలు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు సహా ఓపీఎస్ సాధన కోసం చేయాల్సిన పోరాటంపై చర్చించారు. ప్రభుత్వం మెట్టు దిగేందుకు చేయాల్సిన ఉద్యమాలు ,అమలు చేయాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటి వరకు 4 జేఎసీ లను నమ్మి వారికి అనుబంధంగా పనిచేసిన తమను ఆయా సంఘాల నేతలు మోసం చేశాయని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

19,26, తేదీల్లో సీపీఎస్ రెఫరెండం: ఎపీ జేఎసీ , ఎపీ జేఎసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగులసంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాలో సంబంధం లేకుండా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు నేతలు తెలిపారు. తొలుత ఈ నెల 19,26, తేదీల్లో సీపీఎస్ రెఫరెండం నిర్వహించాలని నిర్ణయించారు. పాత పించన్ విధానాన్ని అమలు చేయాలని సోమవారం జరిగే అన్ని స్పందన కార్యక్రమంలో ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. జీపీఎస్ ను వ్యతిరేకిస్తూ ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జూలై 8 న ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఈనెల 19 నుంచి 26 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గ ఎమ్మెల్యేలకు సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలని కోరాలని మెమోరాండంలు ఇవ్వాలని నిర్ణయించారు.

జేఎసీ నేతలు స్వార్థం కోసం:సీపీఎస్ ఉద్యోగుల డిమాండ్​ను నెరవేర్చడంలో ప్రస్తుతం ఉన్న 4 జేఎసీ నేతలు ఘోరంగా విఫలమయ్యారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. వారిని నమ్ముకుంటే నట్టేట ముంచి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ డిమాండ్ కోసం తాము పోరాడుతుంటే జేఎసీ నేతలు ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ కు మద్దతు తెలపడం పై మండిపడ్డారు. జేఎసీ నేతలు స్వార్థం కోసం సీపీఎస్ ఉద్యోగులను మోసం చేశారని నేతలు ధ్వజమెత్తారు. సీపీఎస్ జీపీఎస్ ప్రపంచానికే తలమానికం అంటూ సీఎంకు జేఎసీ నేతలు పొగడారని మండిపడ్డారు. ముందుగా జీపీఎస్ ను ఉద్యోగ సంఘాల నేతలకు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని విజయవంతమైతే మిగిలిన ఉద్యోగులకు అమలు చేయాలని సూచించారు. జీపీఎస్ బాగుందంటూ జేఎసీ నేతలు చిడతలు కొడితే వారిని సీపీఎస్ నేతలు తరిమి కొడతారని హెచ్చరించారు. జీపీఎస్​కు హర్షం వ్యక్తం చేసిన జేఎసీల్లో సీపీఎస్ ఉద్యోగులు ఎవరూ ఉండరని, ఆ సంఘాల నుంచి బయటకు వస్తారని నేతలు తెలిపారు.

విజయవాడలో సమావేశమైన.. సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలు

ABOUT THE AUTHOR

...view details