YS Jagan reviews on Health sector: ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు మరింత సులువుగా అందుకునేందుకు ప్రత్యేక యాప్ రూపొందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రజలు వినియోగించుకునేలా యాప్ రూపకల్పన చేయాలని వైద్యారోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం నిర్దేశించారు. ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్దేశించారు. ఏ వ్యాధికి ఏ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుందో బాధితులకు తెలియాలని.. సంబంధిత ఆసుపత్రి లొకేషన్‌తో పాటు డైరెక్షన్ చూపేలా యాప్ ఉండాలన్నారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు దగ్గర నుంచి కూడా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రి గురించి గైడ్ చేసే పరిస్థితి రావాలన్నారు.
ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ - CM YS Jagan review on the design Arogyasree App
YS Jagan reviews on the health department: ఆరోగ్య శ్రీ సేవలు ప్రజలు మరింత సులువుగా అందుకునేందుకు ప్రత్యేక యాప్‌ను తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రజలు వినియోగించుకునేలా యాప్‌ను రూపకల్పన చేయాలని నిర్దేశించారు. ఆరోగ్య శ్రీ సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పంచాలని నిర్దేశించారు. ఆరోగ్య శ్రీ సేవల విషయంలో ఏదైనా తప్పులు జరిగితే కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు.
ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఏమైనా తప్పులుంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. సరిగ్గా సేవలు అందించకపోవడం, సేవల్లో నాణ్యత లేకపోవడం వంటి అంశాలపై కచ్చితంగా దృష్టి పెట్టాలన్నారు. నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌పై కచ్చితంగా పరిశీలన చేయాలన్న సీఎం.. చర్యలు ఉండాలన్నారు. డయాలసిస్ పేషెంట్లకు సేవలందించేందుకు 108 వాహనాలు వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తగిన స్థాయిలో సన్నద్ధం కావాలని సీఎం ఆదేశించారు. ఉగాది కల్లా విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలను పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలులో స్త్రీ శిశుసంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలని సీఎం ఆదేశించారు.
ఇవీ చదవండి: