CM YS Jagan Hold Meeting in Vijayawada: వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల వరకూ వైకాపాకు తిరుగులేదని సీఎం జగన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంపై అక్కడి నేతలతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను ఖరారు చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లాలని నేతలకు సూచించిన సీఎం.. చేసిన సంక్షేమాన్ని వివరించి అందరి ఆశీర్వాదం తీసుకోవాలని సూచించారు.
విజయవాడ తూర్పు అభ్యర్థిగా దేవినేని అవినాష్.. ఖరారు చేసిన జగన్ - YSRCP Activists of Vijayawada East Constituency
Vijayawada East Constituency: విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ను ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల వరకూ వైకాపాకు తిరుగులేదని సీఎం జగన్ అన్నారు.
'ఇప్పటివరకు మనమంతా గడప గడపకు అంటూ ప్రజలతో మమేకవుతూ.. ప్రజల్లోకి వెళ్తున్నాం. మనం చేసే పనులను ప్రజలకు తెలుపుతూ.. వారి ఆశీస్సులు తీసుకోవాలి, అందుకోసం ప్రతి ఇంటికీ వెళ్లాలి. వారికి మనం ఎలాంటి సంక్షేమాన్ని అందిస్తున్నామో తెలియజేయాలి. ఈ సారి మనం ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. మన మధ్య ఉన్న సమస్యలను పక్కన పెట్టాలి. అందుకు అందరం కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల వరకూ వైకాపాకు తిరుగులేదు.' -సీఎం జగన్
ఇవీ చదవండి: