ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా చెప్పినట్లు చేస్తేనే ఎన్నికల సంఘం సక్రమంగా చేసినట్లా?: కేసీఆర్

KCR on Munugode Bypoll: కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రప్రభుత్వం దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

kcr
kcr

By

Published : Nov 3, 2022, 8:50 PM IST

Updated : Nov 3, 2022, 10:10 PM IST

KCR on Munugode Bypoll: భారమైన మనసుతో, దుఃఖంతో ఈసారి మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 50 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని.. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తోందని ఆరోపించారు. అన్ని రంగాల్లో దేశాన్ని భాజపా సర్వనాశనం చేసిందని విమర్శించారు.

మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్​

''నిరుద్యోగం పెరగడం, రూపాయి విలువ పడిపోయింది. భాజపా... విభజన రాజకీయాలు చేస్తోంది. భారత ప్రజాస్వామ్య జీవనాడిని భాజపా కలుషితం చేస్తోంది. భారత్‌ను ఆకలి రాజ్యంగా భాజపా మార్చేసింది. పోలింగ్‌ కంటే ముందు మాట్లాడితే మునుగోడులో లబ్ధి కోసమేనని ప్రచారం చేస్తారని ఆగాను. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయాలనే పోలింగ్‌ తర్వాత మాట్లాడుతున్నా... విచ్చలవిడిగా అసత్య, దుష్ప్రచారాన్ని నాపై చేశారు. హుజూరాబాద్‌లో తెరాస ఓడిపోయింది. దుబ్బాకలో స్వల్ప తేడాతో ఓడిపోయాం. నాగార్జునసాగర్‌లో గెలిచాం. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజం. మేము గెలిస్తేనే లెక్క అనే విధంగా భాజపా వ్యవహరించింది. చివరకు ఎన్నికల సంఘం విఫలమైందని ఇవాళ ఆరోపించారు. భాజపా చెప్పినట్లు చేస్తేనే ఎన్నికల సంఘం సక్రమంగా చేసినట్లా? ఓటమైనా, గెలుపైనా గంభీరంగా స్వీకరించాలి. ఉద్యమ సమయంలోనూ మేము వీళ్లలాగా మాట్లాడలేదు''- కేసీఆర్, ముఖ్యమంత్రి

కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తనను కలిసినట్లు దుష్ప్రచారం చేశారని కేసీఆర్ అన్నారు. రాజ్యాంగానికి నాలుగు మూలస్తంభాలను కూడా వాళ్లు లెక్కచేయట్లేదని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, సీవీసీ, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం కాపాడాలని అందరినీ కోరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కాపాడాలని సుప్రీంకోర్టు సీజే, అన్ని హైకోర్టుల సీజేలు, జడ్జిలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు.

Last Updated : Nov 3, 2022, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details