CM Jagan Review on Medical,Health Department:వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో భాగంగా కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు, దిశ యాప్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం డిసెంబర్ 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేదలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో అధికారులు ఎక్కడా తగ్గొద్దని సీఎం జగన్ సూచించారు
CM Jagan Comments: ''ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలంలో మందులు అందజేయాలి. ఆస్పత్రుల్లో ఎక్కడా ఖాళీలు ఉండకూడదు. సిబ్బంది లేదనే మాట వినపడకూడదు. ఆరోగ్య శ్రీ మీద విస్తృతంగా ప్రచారం చేయండి. ఆరోగ్య శ్రీ సేవలు ఎలా వినియోగించుకోవాలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించండి. ఏ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదు. వైద్య ఖర్చుల కోసం ప్రజలు అప్పులు పాలుకాకూడదు. ఉచితంగా వైద్యం ఎలా పొందాలో వారికి తెలియజేయండి. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ ప్రారంభించండి'' అని సీఎం జగన్అధికారులకు సూచించారు.
ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు - గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష