ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan Review on Agriculture, Civil Supplies Departments: రైతులు పండించిన పంటకు కచ్చితంగా మద్దతు ధర దక్కాలి: సీఎం జగన్ - CM Jagan Review news

CM Jagan Review on Agriculture, Civil Supplies Departments: రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు కీలక విషయాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన జగన్.. రైతులు పండించిన ప్రతి పంటకు కచ్చితంగా మద్దతు ధర దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

CM_Jagan_Review_on_Agriculture
CM_Jagan_Review_on_Agriculture

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 10:17 PM IST

CM Jagan Review on Agriculture, Civil Supplies Departments:రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన మంత్రులు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీదిరి అప్పరాజు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీ నాగిరెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాల కృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్, ఇతర ఉన్నతాధికారులతో పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Jagan Comments: ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..''ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించిన పంటకు కచ్చితంగా మద్దతు ధర దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు మిల్లర్లను ఆశ్రయించాల్సిన అవసరం రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఏటా రైతుల నుంచి తృణధాన్యాల కొనుగోలు పెరిగే అవకాశం ఉన్నందున.. ఆ మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరు ధాన్యాలను ప్రజలకు పంపిణీ చేయాలి. మిల్లెట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై కరపత్రాలతో అవగాహన కల్పించాలి. వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో మహిళలకు స్వయం ఉపాధి మార్గాలు బలోపేతం చేయాలి. పశుగ్రాసం, దాణా కొరత లేకుండా చూసుకోవాలి. ప్రతి ఆర్బీకేని యూనిట్‌గా తీసుకుని T.M.R.. ఇచ్చేలా చూడాలి.'' అని అన్నారు.

CM Jagan Review Meeting on Education: ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్​కు ప్రణాళికలు సిద్ధం చేయాలి: సీఎం జగన్​

Officials Comments: అనంతరం రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులు మాట్లాడుతూ.. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైందని వివరించారు. జూన్, ఆగస్టు నెలల్లో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం పడిందని, దీనివల్ల 73 శాతం మేర సాగు జరిగినట్లు సీఎంకు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ముందస్తు రబీకి రైతులు సిద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. దాదాపు 10 లక్షల ఎకరాల్లో ముందస్తు రబీ పంటలు వేసే అవకాశం ఉందన్నారు. శనగ సహా ఇతర విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు వెల్లడించారు. రబీలో సాగుచేసే శెనగ విత్తనాలపై సబ్సిడీని 25% నుంచి 40%కు పెంచామని తెలిపారు. ప్రస్తుతం విత్తనాల పంపిణీ చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. అక్టోబరు 15లోగా నూరుశాతం ఇ– క్రాపింగ్‌ పూర్తిచేస్తామని తెలిపారు.

CM Jagan Review on Medical and Health Department: వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సమీక్ష.. ఆరోగ్యశ్రీ సేవలపై ముమ్మర ప్రచారానికి ఆదేశం

''ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలి. పంట వేసే ముందు భూసార పరీక్షలు జరగాలి. భూసార పరీక్షల ఆధారంగా ఏ పంటలు వేయాలి..?, ఏయే రకాల ఎరువులు ఎంత మోతాదులో వేయాలి..? అనే వివరాలు రైతులకు స్పష్టంగా తెలిసేలా ఉండాలి. వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో మహిళలకు స్వయం ఉపాధి మార్గాలు బలోపేతంగా నడవాలి. పశుగ్రాసం, దాణా కొరత లేకుండా చూసుకోవాలి.''- వైఎస్ జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి

CM Jagan Suggests AI: టీచర్ల కొరతను ఏఐతో అధిగమించండి.. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం సూచన

ABOUT THE AUTHOR

...view details