ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan Review On Jagananna Bhuhakku, Bhuraksha: భూవివాదాల పరిష్కారానికి మండల స్థాయిలో మొబైల్‌ కోర్టులు: సీఎం జగన్ - CM Jagan Review meeting news

CM Jagan Review On Jagananna Bhuhakku, Bhuraksha: జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాల స్థాయిలో మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.

Jagananna Bhuhakku
CM Jagan Review

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 9:20 PM IST

Updated : Sep 1, 2023, 6:33 AM IST

CM Jagan Review On Jagananna Bhuhakku, Bhuraksha: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో 'జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష' కార్యక్రమంపై అధికారులతో, మంత్రులతో సమీక్షా సమావేశం జరిపారు. సమావేశంలో భూ వివాదాల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని.. భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాల స్థాయిలో మొబైల్‌ కోర్టులు నడిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Officials Disclosed The Details Of The Jagananna Bhuhakku program:జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమంపై గురువారం సీఎం జగన్ సమీక్షించారు. సమీక్షలో అధికారులు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా 13,460 గ్రామాలకు గాను, 12,836 గ్రామాల్లో (95శాతం) డ్రోన్ల ఫ్లైయింగ్‌ పూర్తయిందని సీఎంకు తెలిపారు. మిగతా పనులను అక్టోబరు 15లోగా పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 81శాతం గ్రామాలకు సంబంధించిన సర్వే ఇమేజ్‌ల ప్రక్రియ పూర్తియిందన్న అధికారులు.. 60 శాతం గ్రామాలకు ఓఆర్‌ఐలను జిల్లాలకు పంపే పని పూర్తి చేయాలన్నారు. సర్వేలో 3,240 రోవర్లు పాలు పంచుకుంటున్నట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే.. అదనంగా 1,620 రోవర్లు పెంచినట్లు వివరించారు. ఫేజ్‌-1లోగా భాగంగా తొలి విడతలో 2వేల గ్రామాల్లో అన్ని రకాలుగా సర్వే పూర్తి చేసినట్లు సీఎం జగన్​కు అధికారులు వివరాలను వెల్లడించారు.

CM REVIEW ON WOMENS AND CHILD WELFARE: గర్భిణీలు, బాలింతల కోసం ఏటా రూ.2,300 కోట్లు: సీఎం జగన్

CM Jagan comments:ముఖ్యమంత్రి జగన్ అధికారులతో మాట్లాడుతూ.. ఫేజ్‌-2లో సర్వే పూర్తయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. మొదటి దశలో సర్వే పూర్తయిన 2వేల గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు వేరేచోటుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. గ్రామ సచివాలయాల్లో రిజస్ట్రేషన్‌ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని గుర్తు చేశారు. భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండలాల స్థాయిలో మొబైల్‌ కోర్టులు నడిచేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్పేర్కొన్నారు.

CM Jagan Suggests AI: టీచర్ల కొరతను ఏఐతో అధిగమించండి.. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం సూచన

భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాల గురించి విస్తృత్రంగా ప్రచారం చేయండి. రెవెన్యూ విభాగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల గురించి తెలియజేయండి. సమగ్ర భూ సర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను గ్రామ సచివాలయాలకు తీసుకు వస్తున్నాం. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారు ఇంటిలో నుంచే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా సాంకేతికతను తీసుకువస్తున్నాం.-వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

CM REVIEW: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై సీఎం జగన్ సమీక్షా.. ఖాళీలను భర్తీ చేయండి

Last Updated : Sep 1, 2023, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details