ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan Review Meeting on Education: ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్​కు ప్రణాళికలు సిద్ధం చేయాలి: సీఎం జగన్​ - Cm jagan reviews news

CM Jagan Review Meeting on Education Department: ముఖ్యమంత్రి జగన్ విద్యాశాఖపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ స్కూళ్ల ప్రొఫైల్స్‌ మారే విధంగా అధికారులు పని చేయాలన్నారు.

CM_Jagan_Review_Meeting_on_Education
CM_Jagan_Review_Meeting_on_Education

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 8:56 PM IST

CM Jagan Review Meeting on Education Department: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు, ప్రగతి, ట్యాబ్‌ల వినియోగం, టోఫెల్‌ పరీక్షల సన్నద్ధత, ఐబీ సిలబస్‌ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఐబీ సిలబస్‌ అమలుపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Jagan Issued Key Orders:రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను తీసుకువచ్చేందుకు అవసరమైన మార్గదర్శక ప్రణాళికను రూపొందించాలని.. విద్యాశాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఐబీ సిలబస్‌ విషయంలో దశలవారీగా అమలుచేసే విషయంపైనా అధ్యయనం చేయాలన్నారు. 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు రెండో విడత ట్యాబ్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలని నిర్దేశించారు. వచ్చే డిసెంబరు కల్లా ఐఎఫ్‌పీ, స్మార్ట్‌‌ టీవీలు ఉన్న పాఠశాలలకు పూర్తిగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందాలని జగన్ సూచించారు.

CM Jagan Review on Jagananna Arogya Suraksha: రాష్ట్రంలోని ప్రతీ ఇంట్లో ఆరోగ్య సమస్యలపై జల్లెడ పట్టాలి: సీఎం జగన్‌

Education Department Officials Comments:సీఎం జగన్‌కు విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు, ప్రగతిని అధికారులు వివరించారు. అధికారులు మాట్లాడుతూ.. 'ఇటీవల చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ సత్ఫలితాలను ఇచ్చింది. ప్రాథమిక విద్యలో నూటికి నూరుశాతం పిల్లలు బడిలోనే ఉన్నారు. తాజా డ్రైవ్‌లో భాగంగా ప్రతి పిల్లాడూ బడిలో ఉండేలా చూసుకున్నాం. సీనియర్‌ సెకండరీ విభాగంలో 96.94 శాతం మంది, హయ్యర్‌ సెకండరీ విభాగంలో 74.9శాతం పిల్లలు బడిలో ఉన్నారు. అమ్మఒడి, 10, 12 తరగతుల్లో ఫెయిల్‌ అయిన వారికి రీ అడ్మిషన్, స్కిల్‌ సెంటర్లలో చేర్పించాము. అంతేకాకుండా, వారికి ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్, వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేసిన ప్రచారం సత్ఫలితాలు ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తంగా 83 లక్షల 52 వేల 738 మంది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు' అని అధికారులు వివరాలను వెల్లడించారు.

CM Jagan Review Meeting with Agriculture Department Officials: రాష్ట్రంలో వర్షాభావం.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై జగన్‌ సమీక్ష

CM Jagan Comments:ముఖ్యమంత్రి జగన్ అధికారులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది రెండో విడత ట్యాబ్‌లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటిల్‌ అసిస్టెంట్లతో డివైజ్‌ వినియోగంపై బడి పిల్లలకు క్లాసులు ఇప్పించాలన్నారు. తొలి విడతగా నిర్దేశించుకున్న మేరకు ఇప్పటికి 4,804 స్కూళ్లలో 30,213 ఐఎఫ్‌పీలు బిగించామని అధికారులు తెలిపారు. 6,515 పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీల బిగింపు పూర్తయ్యిందన్నారు. ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీల వినియోగంపై టీచర్లకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.

Discussion on TOEFL Exams: టోఫెల్‌ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధపై సీఎం జగన్ ఆరా తీశారు. వారంలో మూడు రోజుల పాటు మూడు పీరియడ్ల మేర శిక్షణ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతిరోజూ కనీసం అరగంట సమయం ఉండేలా చూడాలని, దీని వల్ల పిల్లలు క్రమంగా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారని తెలిపారు.

Discussion on Implementation of IB Syllabus:ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌.. ఐబీ సిలబస్‌పై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ప్రభుత్వ స్కూళ్ల ప్రొఫైల్స్‌ మారాలన్నారు. బయట స్కూళ్లకంటే.. ప్రభుత్వ స్కూళ్లే ఉన్నతం అన్న రీతిలో మన స్కూళ్లు తయారు కావాలన్నారు. ఇప్పటికే ఇంగ్లీషు మీడియం, తరగతి గదుల డిజిటలీకరణ, నాడు – నేడు పనులు చేపడుతున్నామని, వీటికి తోడు ఐబీ లాంటి సిలబస్‌ను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల దశ మరో స్థాయికి చేరుకుంటుందన్నారు. ఐబీ సిలబస్‌ను ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు.

''పాఠశాలల్లో పిల్లలకు అందిస్తోన్న పోషక ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత తగ్గకూడదు. నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ప్రతిరోజూ పిల్లలకు అందిస్తున్న ఆహారంపై పర్యవేక్షణ ఉండాలి. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో బలహీనంగా, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలపై శ్రద్ధపెట్టండి. వారికి మంచి పౌష్టికాహారం, మందులు అందేలా తగిన చర్యలు చేపట్టండి'' -వైఎస్ జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి

CM Jagan Review on floods: వరదలపై సీఎం జగన్​ సమీక్ష.. వారికి 10వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశం

ABOUT THE AUTHOR

...view details