CM Jagan Review Meeting on Ambedkar Smriti Vanam Works: విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో చేపట్టిన అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టు పనుల్ని ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) సమీక్షించారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పనులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సమీక్షకు మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, అధికారులు వై. శ్రీలక్ష్మి, ఎపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. దాదాపు 400 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నవంబరు 26 తేదీనాటికే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని గతంలో నిర్ణయించినా పనులు పూర్తి కాకపోవటంతో ప్రభుత్వం విగ్రహావిష్కరణను వాయిదా వేసుకుంది. ఇప్పటికే చాలా సార్లు ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసింది. అయితే వివిధ కారణాలతో విగ్రహ నిర్మాణం పూర్తికాకపోవటంతో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు.
మహనీయుడి స్మృతివనంలో మద్యం సేవించటమా ?- నాదెండ్ల
జనవరి 15లోపు పనులు పూర్తి చేసేలా చర్యలు: స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఎలాంటి పెండింగ్ పనులు ఉండకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రిపబ్లిక్‌డే నాటికి ... పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. జనవరి 15లోపు పనులు పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు వెల్లడించారు. జనవరి 24న అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని ప్రారంభించే విధంగా సర్వం సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. కృష్ణలంక ప్రాంతంలో... రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల మేరకు... సుందీకరణ పనులపై, అధికారులు పలు ప్రతిపాదనలు చేశారు. పార్క్, వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు సీఎంకు అధికారులు తెలిపారు. పనులు చురుగ్గా సాగుతున్నాయన్నాయని అధికారులు పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం పీఠం ఎత్తు 81 అడుగులు... విగ్రహం ఎత్తు 125 అడుగులు ఉండనుంది.