AP Rank for Nationally in Unemployment Training :కళాశాలల్లో 120 కోర్సుల్లో బోధన, శిక్షణ ఇవ్వండి.. పరిశ్రమలు కళ్లకు అద్దుకొని తీసుకొనేలా యువతను సిద్ధం చేయాలి.. నైపుణ్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయండి.. అంటూ నైపుణ్యాభివృద్ధిపై ఆదేశాలివ్వడంలో ముందుండే సీఎం జగన్.. వాటి అమలు తీరును మాత్రం పట్టించుకోవడం లేదు. జగన్ ఏలుబడికి నాలుగున్నరేళ్లు దాటిపోయింది. నైపుణ్య విశ్వవిద్యాలయాల మాట దేవుడెరుగు.. ఇంతవరకు కనీసం నైపుణ్య కళాశాలలకు భవనాలే నిర్మించలేకపోయారు.
AP Rank in Country for Employment :కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన కింద ఇస్తున్న నిధులను తీసుకుంటూ.. కేవలం మొక్కుబడి తంతుగా నైపుణ్య శిక్షణను నడిపిస్తున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలను నిర్ధాక్షిణ్యంగా మూసేసి.. నిరుద్యోగులను నైపుణ్యానికి దూరం చేశారు.ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విశాఖలో నైపుణ్య వర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం.. ఇంతవరకు దానికి స్థలాన్నే ఖరారు చేయలేకపోయారు. అలాగే తిరుపతి జిల్లా కోబాక సమీపంలో మరో నైపుణ్య వర్సిటీ ఏర్పాటు కోసం 50 ఎకరాలు సేకరించి వృథాగా వదిలేశారు.
నైపుణ్య కళాశాలలు, వర్శిటీల ఏర్పాటులో.. పడని ముందడుగు
వర్శిటీకి అనుబంధంగా 30 కళాశాలలు ఏర్పాటు చేస్తామని.. 1210కోట్ల రూపాయలతో నైపుణ్య కళాశాలలునిర్మిస్తామంటూ ఊదరగొట్టారు. కానీ భవన నిర్మాణ ఆకృతులు రూపొందించినా లాభం లేకపోయింది. నిర్మాణాలకు టెండర్లు పిలిస్తే గుత్తేదార్ల నుంచి స్పందనే రాలేదు. దీంతో నిర్మాణాల సంగతి పక్కనపెట్టేసి.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కళాశాలలు ఏర్పాటు చేసి సరిపెట్టేశారు.
Deendayal Upadhyaya Gramin Kaushalya Yojana : నైపుణ్య శిక్షణకు అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నా.. ఎలాంటి లాభం లేదు. కేంద్ర పథకం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన కింద అందించే కోర్సులనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్రం కొన్ని సంస్థల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుండగా.. రాష్ట్ర ఉద్యోగ కల్పన, వ్యవస్థాపక అభివృద్ధి సంస్థను.. రాష్ట్ర ప్రభుత్వం తరపున చూపి.. నిధులు తీసుకుంటోంది. కానీ ఘనత మాత్రం తమదిగానే ప్రచారం చేసుకుంటోంది.