CM Jagan Negligence On Weekly Off To Police :పోలీసులకు వీక్లీ ఆఫ్‌పై 2019 అక్టోబర్ 21న సీఎం జగన్ (CM Jagan) ఘనంగా చెప్పారు. అంతకుముందు అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జూన్ 25న జగన్ తొలిసారి నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులోనూ ఇలాంటి మాటలే చెప్పారు. "మన పాలనలో వారాంతపు సెలవుల విధానం కచ్చితంగా కొనసాగుతుందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తున్నామన్నారు. బిహార్‌లో ప్రయత్నం చేసినా సఫలం కాలేదన్నారు. 20-25 శాతం పోలీసు సిబ్బందిని అదనంగా నియమిస్తామని చెప్పారు. చెప్పినట్లే 2019 జూన్ 19 నుంచి వైసీపీ ప్రభుత్వం "వీక్లీ ఆఫ్ (Weekly Off)" అమల్లోకి తెచ్చింది. రవిశంకర్ అయ్యన్నార్ (Ravi Shankar Ayyanar) ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సుల మేరకు 19 రకాలుగా వీక్లీ ఆఫ్‌ల అమలు మొదలుపెట్టింది. పోలీసులూ సీఎంకు సన్మానాలు, సత్కారాలు చేశారు. కానీ మొదట్లో ఓ నాలుగైదు నెలల పాటు సక్రమంగానే ఈ విధానం అమలైనా ఆ తర్వాత మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చేశారు.
YSRCP Government Stop AP Police Weekly Off :2020 అక్టోబర్ 21 న పోలీసుల అమరవీరుల సంస్మరణ(Commemoration of Police Martyrs) వేళ.. సీఎం మరోసారి వీక్లీ ఆఫ్‌ల విధానంపై గొప్పలు చెప్పుకుంటూ సిబ్బందిని పెద్ద ఎత్తున నియమిస్తామన్నారు. కానీ ఈ హామీకీ మంగళం పాడేశారు. 2020 మార్చిలో కొవిడ్ (Covid) పరిస్థితులు, లాక్‌డౌన్ (Lockdown) కారణాలతో "వీక్లీ ఆఫ్"ల విధానాన్ని నిలిపేశారు. ఆ తర్వాతైనా ఈ విధానాన్ని అమలు చేస్తారని పోలీసు సిబ్బంది భావించినప్పటికీ.. జగన్ ప్రభుత్వం(Jagan Govt) దానికి పూర్తిగా స్వస్తి పలికేసింది. పూర్తిస్థాయిలో వీక్లీ ఆఫ్‌లు అమలు కావాలంటే పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల 384 ఖాళీల్ని భర్తీ చేయాలని ఈ విధానం ప్రారంభించినప్పుడే... రవిశంకర్ అయ్యన్నార్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ దిశగా జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు.
Police Weekly Off in ap: 'వీక్లీ ఆఫ్' నిర్ణయం త్వరలోనే పునరుద్ధరణ - హోంమంత్రి
AP Police Weekly Off :2021 అక్టోబర్ 21నాడు మళ్లీ పోలీసులు వీక్లీ ఆఫ్‌లపై పాత పల్లవే వినిపించిన సీఎం జగన్.. ఈసారి కరోనాను బూచిగా చూపారు. కానీ ఈరోజు నుంచే అమలు చేస్తున్నాం అంటూ మరోసారి పోలీసులను నమ్మించి మోసం చేశారు. మరో ఏడాది గడిచిపోయింది కానీ జగన్ ఇచ్చిన హామీ నెరవేరలేదు.