ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబేడ్కర్‌ స్మృతివనం, విగ్రహ నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష

CM JAGAN REVIEW on AMBEDKAR STATUE: విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా అంబేడ్కర్‌ స్మృతివనం, అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని.. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పురోగతిపై జగన్ నేడు అధికారులతో సమీక్షించారు. ఇదొక శాశ్వతమైన ప్రాజెక్టని, పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని అధికారులకు నిర్దేశించారు. నిర్మాణంలో నాణ్యతతో పాటు సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. అధికారులు సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలని సూచించారు.

CM JAGAN REVIEW
CM JAGAN REVIEW

By

Published : Mar 9, 2023, 5:01 PM IST

CM JAGAN REVIEW on AMBEDKAR STATUE: విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా అంబేడ్కర్‌ స్మృతివనం, అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని.. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్వరాజ్‌ మైదానంలో ఏర్పాటు కాబోతున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పురోగతిపై ఈరోజు సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని, విగ్రహ విడిభాగాలు సిద్ధంగా ఉన్నాయని, ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. స్మృతివనం ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని, నెలాఖరుకు స్లాబ్‌ వర్కులు పూర్తవుతాయని తెలిపారు. ఇదొక శాశ్వతమైన ప్రాజెక్టని, పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. నిర్మాణంలో నాణ్యతతో పాటు సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. అధికారులు సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలని తెలిపారు.

అంబేడ్కర్‌ స్మృతివనం, అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష

ఈ ఏడాది ఏప్రిల్‌ 14 వరకు పూర్తి: వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, అంబేడ్కర్‌ స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీకల్లా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాం నిర్మాణాన్ని పూర్తిచేయటమే లక్ష్యంగా అధికారులు, మంత్రులు పనులన చకచకా చేయిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ స్మృతివనం, అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు: సమీక్షలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌. కెఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ప్లానింగ్‌ ఎక్స్‌ అఫిషియో సెక్రటరీ జి విజయ్‌ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ హర్షవర్ధన్, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావు, ఏపీఐఐసీ వీసీ, MD సృజనతోపాటు మున్సిపల్‌ కమిషనర్‌ (విజయవాడ) స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ ప్రాజెక్ట్ శాశ్వతమైనది: విజయవాడలో నిర్మాణం కాబోతున్న అంబేడ్కర్‌ స్మృతివనం పనుల గురించి, 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ పురోగతి గురించి అధికారులతో సీఎం జగన్​ సుదీర్ఘంగా చర్చించారు. అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు అని, విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా నిర్మాణాలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అనంతరం స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్‌ సెంటర్‌ అత్యంత ప్రధానమైందని.. కన్వెన్షన్​ నిర్మాణంలో నాణ్యత, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి.. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అన్ని స్లాబ్‌ వర్కులు ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయన్నారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని.. విగ్రహ విడిభాగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

13 దశల్లో విగ్రహ నిర్మాణం పూర్తి: ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. స్టాట్యూ నిర్మాణం కోసం ఏకంగా 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కును, మరో 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. విగ్రహం తయారీతో పాటు దానిచుట్టూ సివిల్‌ వర్క్స్ సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను సీఎంకు అధికారులు వివరించారు. అంబేడ్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టని, పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పనుల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details