ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM Jagan Mohan Reddy Hoisted National Flag: స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం చేయలేని మార్పులు చేశాము: సీఎం జగన్ - AP CM Jagan news

CM Jagan Mohan Reddy Hoisted National Flag: 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేసి.. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాజధాని వికేంద్రీకరణను 3 ప్రాంతాల హక్కుగా చేయబోతున్నామని ప్రకటించారు.

humbnail_16x9_jagan_Independence_comments_2023
humbnail_16x9_jagan_Independence_comments_2023

By

Published : Aug 15, 2023, 11:49 AM IST

స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం చేయలేని మార్పులు చేశాము: సీఎం జగన్

CM Jagan Mohan Reddy Hoisted National Flag: 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం డీజీపీతో కలిసి ఓపెన్ టాప్‌ జీప్‌లో తిరుగుతూ.. సాయుధ దళాలు, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శనను తిలకించిన సీఎం జగన్.. 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామన్నారు. అన్ని గ్రామాల్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. తమ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

CM Jagan Comments..స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరైన వారిని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తూ..''గతంలో ఏ ప్రభుత్వం అమలుచేయని గొప్ప మార్పు ఇది. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం మనదే. పాడి రైతులకు పాలవెల్లువ కార్యక్రమం తీసుకొచ్చాం. మూతబడిన చిత్తూరు డెయిరీతో పాటు సహకార సంఘాలకు జీవం పోశాం. భూవివాదాలకు ఆస్కారం లేకుండా రైతన్నకు మంచి చేస్తున్నాం. 1.54 లక్షల ఎస్టీ రైతులకు 3.23 లక్షల ఎకరాలను పట్టాగా ఇచ్చాం. ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. వంశధార ఫేజ్‌-2 పనులు, వంశధార నాగావళి పనులు అనుసంధానం చేస్తున్నాం. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం'' అని అన్నారు.

IB Syllabus in AP Schools: ప్రభుత్వ బడుల్లో మరో కొత్త సిలబస్.. ఇంటర్ వరకు ఐబీ అమలు దిశగా అడుగులు

We have filled 53,126 posts in the medical department.. ఇప్పటికే వెలుగొండలో మొదటి టన్నెల్‌ పనులు పూర్తి చేశామన్న ముఖ్యమంత్రిజగన్.. త్వరలోనే వెలుగొండ రెండో టన్నెల్‌ పనులు కూడా పూర్తవుతాయని అన్నారు. ప్రపంచ విద్యా రంగంలో మార్పులకు అనుగుణంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. వైద్యారోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తల్లీబిడ్డ కింద 2,204 వైద్య వాహనాలను నడుపుతున్నామన్నారు. దీంతోపాటు ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా ఆదేశాలు ఇచ్చామన్న జగన్‌.. వైద్యశాఖలో 53,126 పోస్టుల భర్తీ చేశామన్నారు. 108, 104 సేవల కోసం కొత్తగా వాహనాలను కొనుగోలు చేశామని వెల్లడించారు. ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామన్న సీఎం.. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నామన్నారు. నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం మహిళలకే ఇచ్చేలా చట్టం చేశామన్నారు.

Independence Day Celebrations In AP: ఏపీలో అట్టహాసంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన సీఎం జగన్

పేద వర్గాల అణచివేతపై, రూపు మార్చుకున్న అంటరానితనంపై.. నాలుగేళ్లుగా యుద్ధం చేస్తున్నాం. పేదలకు సంక్షేమ పథకాలు రానీయకుండా అడ్డుకోవడమూ.. అంటరానితనమే. రాజధాని వికేంద్రీకరణను 3 ప్రాంతాల హక్కుగా చేయబోతున్నాం. స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయలేని మార్పులు చేసి చూపిస్తున్నాం. పెత్తందారీ భావజాలంపై యుద్ధం చేస్తున్నాం. లంచాలకు తావులేకుండా 2లక్షల 31 వేల కోట్లు లబ్ధిదారులకు చెరవేశాం. జిల్లాల వికేంద్రీకరణ చేశాం. రాజధాని వికేంద్రీకరణ కూడా చేయబోతున్నాం. నాలుగేళ్ల పాలనలో ప్రధానంగా 10రంగాల్లో మార్పులు తెచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోనూ 98.5 శాతం అమలు చేసి చూపించాం.-వైఎస్ జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి

CM Jagan Suggests AI: టీచర్ల కొరతను ఏఐతో అధిగమించండి.. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం సూచన

ABOUT THE AUTHOR

...view details