CM Jagan met Singanamala MLA Jonnalagadda Padmavathi:రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. జగనన్నకు ఎదురు చెప్పలేరు, చంద్రన్నతో చేయి కలపలేరు అన్నట్లుగా తయారైంది వైఎస్సార్సీపీ మంత్రులు ఎమ్మెల్యేల పరిస్థితి. ఇన్నాళ్లు తానే అన్ని అనుకొని చెమటోడ్చిన నేతలకు మెుండిచేయి చూపుతున్నాడు జగనన్న. సర్వం జగనే అనుకొని వెంట నడిచిన నేతలకు కాళ్లకింద నీరు వచ్చేదాకా తెలియడం లేదు, తమను జగన్ మోసం చేశారని. ఈ సందర్భంగా సీఎం జగన్ నమ్ముకొని మోసపోయిన నేతలు తమ ఆవేదన సైతం చెప్పుకోవడానికి భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది. వైఎస్సార్సీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ధిక్కార స్వరం వినిపిస్తున్న వారిని, బుజ్జగించడమో, లేదా వదిలేయడమో జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
High Court: పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు:హైకోర్టు
నిన్నటి రోజున శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తన టికెట్ విషయమై ఫేస్ బుక్ లైవ్లో తన ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది. తనకు శింగనమల సీటు నిరాకరణపై వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పద్మావతి విమర్శలు గుప్పించారు. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆరోపించారు. ‘అందరికీ అణిగిమణిగి ఉండాలి. ఎవరినో సంతృప్తిపరచడానికి వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకోవాలి. నీళ్లు ఇవ్వకపోయినా మాట్లాడకూడదు. పొరపాటున మాట్లాడితే అది పెద్ద నేరం’ అంటూ పద్మావతి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు సీఎం జగన్ను కలవాలంటూ జొన్నలగడ్డ పద్మావతికి సీఎంఓ నుంచి పిలుపు అందింది. జగన్‌తో భేటీ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై జగన్‌కు వివరణ ఇచ్చేందుకు పద్మావతి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.