CM Meet CJI విజయవాడ నోవోటెల్ హోటల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు వారిద్దరూ భేటీ అయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. భేటీ అనంతరం సీఎం దంపతులు నోవోటెల్ హోటల్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం తెదేపా చంద్రబాబు జస్టిస్ ఎన్వీ రమణతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ప్రతిమను సీజేఐకి చంద్రబాబు బహుకరించారు. దాదాపు 20 నిమిషాలు పాటు సీజేఐతో చంద్రబాబు భేటీ కొనసాగింది. చంద్రబాబుతో పాటు నేతలు ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడులు కూడా జస్టిస్ ఎన్వీ రమణను కలిశారు.
CM Meet CJI సీజేఐని కలిసిన సీఎం జగన్, చంద్రబాబు - విజయవాడలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
CM Meet CJI విజయవాడలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. సీజేఐని సీఎం జగన్ దంపతులు కలిసిన అనంతరం చంద్రబాబుతోపాటు పలువురు తెదేపా నేతలు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
జగన్, చంద్రబాబు కాన్వాయ్లు క్లాష్ కాకుండా అధికారులు షెడ్యూల్ ఏర్పాటు చేశారు. ఇరువురి కాన్వాయ్లు ఎదురు పడకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. సీఎం నోవోటెల్ హోటల్ సెల్లార్ మార్గం ద్వారా వెళ్లి సీజేఐని కలిసి అదే మార్గంలో తిరిగి వెళ్లిపోయారు. చంద్రబాబు హోటల్ ప్రధాన ద్వారం పోర్టుకో ద్వారా వెళ్లి సీజేఐను కలిసి తిరిగి వెళ్లేలా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు కాన్వాయ్కి రూట్ క్లియరెన్స్ విషయంలో పోలీసులు ఇబ్బంది పెట్టారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. చంద్రబాబు మార్గంలో రూట్ క్లియర్ చేస్తానన్న డీజీపీ ట్రాఫిక్ వదిలి అడ్డంకులు సృష్టించడం వల్లనే అయన పర్యటన 10 నిమిషాలు ఆలస్యమైందని తెదేపా నేతలు ఆరోపించారు.
ఇవీ చదవండి: