FAREWLL TO GOVERNOR: ఇటీవలే ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ నుంచి పయనమయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గవర్నర్‌కి పోలీసులు గౌరవ వందనం చేశారు. సుమారు 44 నెలల పాటు తనకు సహకరించిన అందరికీ బిశ్వభూషణ్ హరిచందన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్ల తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని అన్నారు.
నేడు రాష్ట్రానికి నూతన గవర్నర్ రాక: రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ నియామకంపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జస్టిస్ నజీర్‌ను గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ జారీ చేసిన ఉత్తర్వుల్ని పొందుపరుస్తూ జీవో ఇచ్చింది. ఆ అంశాన్ని గెజిట్‌లో నోటిఫై చేసింది. జస్టిస్ అబ్దుల్ నజీర్ దిల్లీ నుంచి ఈరోజు రాత్రి 7:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాదర స్వాగతం పలకనున్నారు. ఈ నెల 24న రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వీడ్కోలు: బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన శ్రీమతికి రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రవ హరిచందన్ పాల్గొన్నారు. రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది నుంచి తనకు లభించిన సహకారం వల్లే గత మూడున్నరేళ్లుగా రాష్ట్ర గవర్నర్‌గా ఫలవంతమైన పదవీ కాలం కొనసాగిందని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో తన శ్రేయస్సును చూసుకునేందుకు వారి నుంచి తనకు లభించిన సహకారం, మద్దతు గురించి ప్రత్యేకంగా తెలిపారు. తాను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో అనేక విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించడంలో సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ నుంచి పయనమైన గవర్నర్ బిశ్వభూషణ్.. వీడ్కోలు పలికిన సీఎం - ap new governor
FAREWELL TO GOVERNOR : ఛత్తీస్‌గడ్‌కు నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ నుంచి బయల్దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ రాజ్‌భవన్ సిబ్బంది తరఫున గవర్నర్ హరిచందన్‌కు జ్ఞాపికను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ గవర్నర్ హరిచందన్ హయాంలో రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్థంగా నిర్వర్తించడంలో ఆయన మార్గనిర్దేశంతో లబ్ధి పొందారని, ఆయన ఎల్లప్పుడూ తమ ఎంతో ఆప్యాయతతో ఉండేవారన్నారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా మంచి ఆరోగ్యంతో పాటు ప్రజల సేవలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి సూర్య ప్రకాష్, డిప్యూటీ సెక్రటరీ నారాయణ స్వామి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: