CM Jagan at Jayaho BC program in Vijayawada: మరో 18 నెలల్లో మంచికి చెడుకు మధ్య యుద్ధం జరగబోతోందని.. ఆ యుద్ధంలో వైసీపీ గెలవబోతుందని.. సీఎం జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో బలహీనవర్గాలకు చేసిన అభివృద్ధిని వివరించారు. వివిధ పథకాల ద్వారా జరిగిన లబ్ధిని అంకెలతో సహా వివరించిన సీఎం.. ప్రతి కార్యకర్త, నాయకుడు, ప్రజాప్రతినిధులు.. గడప గడపకూ ప్రభుత్వం చేసిన మంచిని తీసుకెళ్లాలని సూచించారు. అలా చేస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు. అదే సమయంలో వైసీపీ 175కి 175 స్థానాలు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చేసిన మంచిని గడప గడపకూ తీసుకెళ్లాలి: సీఎం జగన్ - Jayaho BC program
CM Jagan at Jayaho BC program in Vijayawada: రాబోయే ఎన్నికల్లో..ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపి.. విజయాన్ని చేకూర్చుతారని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం బీసీలను ఉద్దేశించి మాట్లాడారు.
"బీసీల హృదయంలో జగన్...జగన్ హృదయంలో బీసీలు ఎప్పటికీ ఉంటారు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. వెన్నెముక కులాలు. ఇంటి పునాది నుంచి ప్రతి అణువు, పనిముట్లు, వస్త్రాల తయారీ అన్నీ బీసీలే చేస్తున్నారు. అందుకనే బీసీలంటే శ్రమ.. పరిశ్రమ. కుటీర పరిశ్రమల సముదాయం.. గ్రామీణ వృత్తుల సంగమం. దేశ సంస్కృతి, నాగరికతకు ఉన్న ఘనమైన చరిత్ర బీసీలదే. రాజకీయ అధికారంలో రావాల్సిన వాటా రాకనే వెనుకబడ్డారు. బీసీలను వెన్నెముక కులాలుగా మార్చే బాధ్యత నాది. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేశాం. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు మేలు చేస్తున్నాం" -జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇవీ చదవండి: