CM JAGAN AT CONSTITUTION DAY : క్రమశిక్షణ నేర్పే రూల్‌బుక్, సామాజిక ప్రతీక.. రాజ్యాంగం అని సీఎం పేర్కొన్నారు. బడుగులు, నిస్సహాయుల రక్షణకు దేవుడిచ్చిన ఆయుధం.. రాజ్యాంగం అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ పాల్గొన్నారు.
గ్రామసచివాలయల ద్వారా గ్రామ స్వరాజ్యం: ప్రభుత్వ ఇనుప పాదాల కింద బడుగులు నలిగిపోకుండా కాపాడేదే రాజ్యాంగం అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగమే.. మన సంఘ సంస్కర్త అని తెలిపారు. వచ్చే ఏప్రిల్‌లో విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామసచివాలయల ద్వారా గ్రామ స్వరాజ్యం సాధించామన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తమ ప్రభుత్వం తోడ్పాటు అందించినట్లు తెలిపారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు రూ.3.8 లక్షల కోట్లు అందించామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
"క్రమశిక్షణ నేర్పే రూల్‌బుక్, సామాజిక ప్రతీక.. రాజ్యాంగం. బడుగులు, నిస్సహాయుల రక్షణకు దేవుడిచ్చిన ఆయుధం.. రాజ్యాంగం. ప్రభుత్వ ఇనుప పాదాల కింద బడుగులు నలిగిపోకుండా కాపాడేదే రాజ్యాంగం. రాజ్యాంగమే.. మన సంఘ సంస్కర్త. వచ్చే ఏప్రిల్‌లో విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ. గ్రామసచివాలయల ద్వారా గ్రామ స్వరాజ్యం సాధించాం"-సీఎం జగన్