CM appointed Jyotisurekha as Deputy Collector: ప్రముఖ విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతిసురేఖను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూప ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడల కోటాలో ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామంటూ సీఎం ఇచ్చిన హామీ మేరకు జ్యోతిసురేఖను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 30 రోజుల్లోగా భూపరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం జ్యోతి సురేఖను ఆదేశించింది. ఆమెకు డిప్యూటీ కలెక్టర్ కేటగిరీ 2 పోస్టు ఇస్తున్నట్టుగా రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.
డిప్యూటీ కలెక్టర్‌గా ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతిసురేఖ.. - క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ
CM appointed Jyotisurekha as Deputy Collector: ప్రముఖ విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్ కోటాలో ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామంటూ సీఎం ఇచ్చిన హామీ మేరకు జ్యోతిసురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
జ్యోతిసురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియామకం