CLAP DRIVERS : జగనన్న స్వచ్ఛ సంకల్పం- క్లీన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2021 అక్టోబర్ 2తేదీన సీఎం జగన్ 4,097 చెత్త సేకరణ వాహనాల్ని ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు గాను సుమారు 65 మున్సిపాల్టీల్లో ప్రభుత్వం క్లాప్ ఆటో వ్యవస్థను ప్రవేశపెట్టింది. చెత్త సేకరణ బాధ్యత కొన్ని ప్రైవేట్ ఏజన్సీలకు అప్పజెప్పింది. ఉద్యోగ నోటిఫికేషన్ ఏమీ లేకుండా ఏజన్సీ నిర్వాహకులు ఆటో డ్రైవర్లను నియమించుకున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అందరికి ఒకే రీతిలో వేతనాలు ఇవ్వడం లేదని క్లాప్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. 15వేల నుంచి 18వేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి, 10వేల ఆరు వందలే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
CLAP DRIVERS : తక్కువ వేతనం చెల్లింపుపై క్లాప్ డ్రైవర్ల ఆవేదన
CLAP : ప్రజల ఆరోగ్యం.. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపైనే ఆధారపడి ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టింది. చెత్త సేకరణ పనుల్నిప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. అయితే కనీసం వేతనాలు ఇవ్వకపోగా, విధుల్ని నుంచి తొలగిస్తామంటూ అధికారులు, ఏజెన్సీ పెద్దలు బెదిరిస్తున్నారని క్లాప్ డ్రైవర్లు వాపోతున్నారు.
CLAP
మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ఒక్కో క్లాప్ ఆటోకి ఏజన్సీలకు 63వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు కార్మిక సంఘ నాయకులు తెలిపారు. క్లాప్ డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్న ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులకి ఖాతా నెంబరు, కార్డులు ఇవ్వక పోవడం దారుణమంటున్నారు. వారాంతపు సెలవులు కూడా ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారని డ్రైవర్లు ఆరోపించారు. జీవో 7 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: