CID Wife Suicide: విజయవాడలో సీఐడీ ఇన్స్పెక్టర్ భార్య ఆత్మహత్య నగరంలో కలకలం రేపుతోంది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవే ఆత్మహత్యకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు. సీఐడీ విభాగంలో పనిచేస్తున్న చంద్రశేఖర్ పటమట తోటవారి వీధిలో నివాసముంటున్నారు. పిల్లల భోజన విషయంలో భార్యభర్తల మధ్య చిన్న గొడవైందని.. చంద్రశేఖర్ బయటకు వెళ్లగానే అతని భార్య మనస్తాపానికి గురై.. ఫ్యాన్‌కు ఉరివేసుకుందని పోలీసులు తెలిపారు.ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నగరంలో కలకలం రేపిన సీఐడీ ఇన్స్పెక్టర్ భార్య ఆత్మహత్య - సీఐడీ ఇన్స్పెక్టర్ భార్య ఆత్మహత్య చేసుకుంది
CID Wife Suicide: విజయవాడ నగరంలో పోలీస్ అధికారి భార్య ఆత్మహత్య కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవే ఆత్మహత్యకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు. సీఐడీ విభాగంలో చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. విజయవాడలోని పటమట తోటవారి వీధి ప్రాంతంలో నివాసముంటున్నారు. మధ్యాహ్నం 1గంట సమయంలో పిల్లల భోజనం విషయంలో భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆత్మహత్య