Chiranjeevi Fans Fire on YCP Leaders :రాష్ట్రంలో పలుచోట్ల సినీ హీరో చిరంజీవి అభిమానులు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైకాపా నేతలు కొడాలి నాని, పేర్ని నాని, మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు క్షమాపణ చెప్పాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవటంతో తోపులాటలు జరిగాయి. చిరంజీవి అభిమానుల్లో కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Chiranjeevi Fans Fire on AP Ministers : చిరంజీవి అభిమానులను చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవాడ వన్ వే రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రోక్తులైన అభిమానులు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే "డౌన్ డౌన్ కొడాలి నాని.. జై చిరంజీవ" అంటూ నినాదాలు అభిమానుల ర్యాలీని పోలీసులు ముందుకు వెళ్లనీయకపోవడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. ఆందోళన అడ్డుకునే క్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవితోపాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు వాహనాలను ముందుకు వెళ్లనీయకుండా అభిమానులు అడ్డంగా పడుకున్నారు.
Chiranjeevi Fire on AP Govt : ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ఆగ్రహం
Chiranjeevi Fans Protest Against Ministers : భారీగా చేరుకున్న అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు, ముఖ్య నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మిగిలిన అభిమానులు ఏజికే స్కూల్ సెంటర్లో విజయవాడ రోడ్డుపై ధర్నా నిర్వహించి, వంగవీటి మోహన రంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు. చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో గెలిచిన కొడాలి నాని ఓ పెద్ద చెకోడీ గాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికు గుణపాఠం తప్పదని, స్థాయి మరిచి మెగాస్టార్ చిరంజీవిని విమర్శించిన కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని అభిమానులు స్పష్టం చేశారు.