ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Manifesto: మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతులకు అధిక ప్రాధాన్యం: టీడీపీ - 2024 ఎన్నికల మానిఫెస్టో

Kollu Ravindra: బీసీ రక్షణ చట్టం రూపకల్పన బీసీలకు చరిత్రలో మెయిలు రాయి అని కొల్లు రవీంద్ర వెల్లడించారు. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో పై టీడీపీ నేతలు స్పందించారు. మేనిఫెస్టో పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేత బుద్ద వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, యువత, రైతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా టీడీపీ మేనిఫెస్టో ఉంటుందని ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 29, 2023, 8:46 PM IST

Chandrababu Released TDP Manifesto: మహానాడు వేదికగా మహిళలకు, బీసీలకు చంద్రబాబు మహా కనుక ఇచ్చారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అన్న నందమూరి తారక రామారావు తరువాత మహిళలకు, బీసీ లకు అండగా నిలిచింది చంద్రబాబు మాత్రమేనన్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున "మహాశక్తి" పేరుతో ఆర్థిక సహాయం, మహిళలు రక్షణ కొరకు ప్రత్యేక చట్టం లాంటివి ప్రకటించారన్నారు.

బీసీ రక్షణ చట్టం రూపకల్పన బీసీలకు చరిత్రలో మైలు రాయి కానుందని కొల్లు రవీంద్ర వెల్లడించారు. యువతకు మహాబలం రూ.3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు అని స్పష్టం చేసారు. అన్నదాతకు ఆర్థిక ఆసరా "అన్నదాత" పేరుతో ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సహాయం గొప్ప కార్యక్రమమన్నారు. విద్యార్థులకు భవిష్యత్తు భరోసా కోసం ఇంట్లో ఎంతమంది పిల్లలు వున్నా ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు చొప్పున "తల్లికి వందనము" పేరున ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి మహిళకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు "దీపం" పథకం కింద ఉచితం, మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కొల్లు పేర్కొన్నాడు. ఇంటింటికి మంచినీటి కుళాయి లక్ష్యంగా మంచినీటి పథకం వంటివి గొప్ప కార్యక్రమాలన్నారు.

Suicide Attempt: న్యాయం చేయాలంటూ.. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనర్లు ఆత్మహత్యాయత్నం

పేదవారిని ధనవంతులుగా చేసే ఏకైక లక్ష్యంతో నిరుద్యోగ యువతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యతను అందించి, ఆర్థిక తోడ్పాటు కల్పించి వారిని వ్యాపారస్థులుగా తీర్చిదిద్ది వారిని ధనవంతులుగా తీర్చిదిద్దడమే ''పూర్ టూ రిచ్'' అనే కార్యక్రమమని ప్రకటించారు. ఇది ట్రైలర్ మాత్రమేనని.. వచ్చే విజయదశిమికి పూర్తి స్థాయిలో భవిష్యత్ ప్రణాళికవిడుదల చేస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు.

బీసీలకు చంద్రబాబు మహా కనుక ఇచ్చారన్న కొల్లు రవీంద్ర

మరో ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేసారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక్కొక్కరికి తగిన రీతిలో గట్టిగా సమాధానము ఇస్తామని కొల్లు వెల్లడించారు. ఎక్కడా దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజానీకానికి, మహానాడును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్​ శతజయంతి సందర్బంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Jagan Delhi Tour: వివేకా హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే జగన్ దిల్లీ టూర్​: కనకమేడల

కొడాలి నానిపై ఆగ్రహం:తెలుగుదేశం అదినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం సీనియర్‌ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ రాయలసీమలో సింహం లాగా పాదయాత్ర చేస్తుంటే, కొడాలి నాని వైసీపీ కార్యాలయంలో కూర్చుని తిడుతున్నాడని ధ్వజమెత్తారు. కావాలనే ప్రతి సారి జూనియర్ ఎన్టీఆర్​ను బయటకు లాగుతున్నాడని విమర్శించారు. బీసీలను కించపరిచే విధంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలపై అనేక రకాలైన కేసులు పెట్టారని మండిపడ్డారు. కొడాలి నాని బీసీ లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు కనుసైగ చేస్తే లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులను బంగాళాఖాతంలో కలిపేస్తారని బుద్ద వెంకన్న హెచ్చరించారు.

రాష్ట్ర ప్రజల నుంచి అనూహ్య స్పందన మహానాడులో చంద్రబాబు ప్రకటించిన భవిష్యత్తు గ్యారెంటీకి రాష్ట్ర ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో వైసీపీ నేతలకు నిద్ర కరువైందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మహిళలు, యువత, రైతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా టీడీపీ మేనిఫెస్టో ఉంటుందన్నారు. ఆడబిడ్డలను మహాశక్తిగా తయారు చేసేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. జగన్ రెడ్డి లాగా పథకాలకు పేర్లు మార్చి మోసం చేయడం జరగదు అన్నారు. రాబోయే ఐదు నెలల్లో మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, దసరాకు పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపొందించడం జరుగుతుందన్నారు.

మ్యానిఫెస్టోలో మహిళలకు పెద్దపీట విజయవాడ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం వద్ద సంబరాలుచేశారు. మ్యానిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయటం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని, టీడీపీ మహిళానేతలు అధినేత చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు మహిళా పక్షపాతి అంటూ నేతలు కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details