Chandrababu Release TDP Workers Celebrations :మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై (TDP Chief Chandrababu Interim Bail) విడుదల కావడం.. ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందర్లపాడులో టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి.. మిఠాయిలు పంచారు. గుంటూరు ముత్యాలరెడ్డి నగర్లోబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ.. అమరావతి రైతులు తుళ్లూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. కృష్ణాయపాలెం శివాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. మందడంలో అమ్మవారికి పూజలు చేశారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 116 టెంకాయలు కొట్టారు.
TDP Leaders Celebrations over CBN Interim Bail :పల్నాడు జిల్లా నరసరావుపేట NGO కాలనీలో మహిళలు అభయ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వెయ్యి టెంకాయలు కొట్టారు. 500 మందికి అన్నదానం చేశారు. బాపట్ల జిల్లా అద్దంకిలో బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చారు. గూడూరు లో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ లుంగీడాన్స్ చేశారు.
Chandrababu Interim Bail in AP Skill Development Case :కర్నూలులో నంద్యాల చెక్ పోస్ట్ వద్ద పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆధ్వర్యంలో మిఠాయిలు పంచారు. మంత్రాలయంలో తిక్కారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. నంద్యాల తెలుగుదేశం కార్యాలయం వద్ద పొలిట్ బ్యూరో సభ్యుడు ఫరూక్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చారు. నందికొట్కూరులో పార్టీ కార్యాలయం నుంచి పటేల్ కూడలి వరకు ర్యాలీ చేశారు.
CBN Interim Bail Celebrations :అనంతపురంలో మైత్రివనం సర్కిల్ వద్ద చంద్రబాబు చిత్రపటానికి గుమ్మడికాయతో దిష్టి తీసి.. పాలాభిషేకం చేశారు. రాయదుర్గం వినాయక సర్కిల్ వద్ద స్వీట్లు పంచారు. సత్య సాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు. కడప ఎన్టీఆర్ కూడలిలో డప్పులు వాయిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.