Chandrababu Ra Kadhali Ra Program : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ‘రా కదిలిరా !’ రెండో బహిరంగ సభలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించనున్నారు. కనిగిరిలో నిర్వహించిన తెలుగుదేశం పిలుస్తోంది 'రా కదలిరా' బహిరంగ సభ విజయవంతం కావడంతో ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించే బహిరంగ సభలను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించేందుకు తెలుగుదేశం శ్రేణులు ఉవిళ్లురుతున్నాయి. తిరువూరులో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు ఆచంటలో నిర్వహించే సభలో పాల్గొంటారు. చంద్రబాబు విడుదల తర్వాత తిరువూరులో నిర్వహించబోతున్న మొదటి సభ కావడంతో నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.
Chandrababu Public Meeting in Tiruvuru : చంద్రబాబు తిరువూరు సభ కోసం దాదాపు 60 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, తెలంగాణా సరిహద్దు ఖమ్మం జిల్లా నుంచి టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. పార్టీ అంచనాల ప్రకారం లక్షమంది కార్యకర్తలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం సభ కావడంతో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 60 ఎకరాల్లో సభ వేదిక, కార్యకర్తలు, అభిమానులు ఆశీనులు అయ్యేందుకు 23 ఎకరాలను కేటాయించారు. ఆ మేరకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మరో 20 ఎకరాల్లో వాహనాలు నిలిపేందుకు ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలంలో వివిధ రకాల కౌంటర్లు ఏర్పాటు చేశారు.