Chandrababu Naidu attending ISB 20 Years Functin: శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) హైదరాబాద్ క్యాంపస్‌లో 20 ఏళ్ల ఆవిర్భావ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. 20 ఏళ్ల ఆవిర్భావ ముంగిపు వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐఎస్‌బీ విద్యార్ధులతో ముఖాముఖీ చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటుకు చంద్రబాబు కృషి చేశారు. 2001లో నాటి ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా హైదరాబాద్ ఐఎస్‌బీ సంస్థ ప్రారంభమైంది. అనేక రాష్ట్రాలు పోటీ పడినా ఐఎస్‌బీ ప్రతిష్టాత్మక సంస్థను నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో చంద్రబాబు కృషి కీలకమైంది.
ఐఎస్‌బీ 20 ఏళ్ల ఆవిర్భావ ముగింపు వేడుకలకు పాల్గొననున్న చంద్రబాబు - ఐఎస్‌బీ విద్యార్ధులతో చంద్రబాబు ముఖాముఖీ
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) హైదరాబాద్ 20 ఏళ్ల ఆవిర్భావ ముంగిపు వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు హైదరాబాద్‌లో ఐఎస్‌బి ఏర్పాటుకు చంద్రబాబు కృషి చేశారు. 2001లో నాటి ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా హైదరాబాద్ ఐఎస్‌బీ సంస్థ ప్రారంభమైంది.
CBN